Short News

కశ్మీర్‌ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ పూర్తి చేసుకున్న ఆంపియర్‌ నెక్సస్‌

కశ్మీర్‌ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ పూర్తి చేసుకున్న ఆంపియర్‌ నెక్సస్‌

బైక్‌ లేదా స్కూటర్‌ కొనుగోలు చేయాలంటే చాలా ఆలోచిస్తాం. మైలేజ్‌, ధర, పర్ఫామెన్స్‌ ఇలా చాలా రకాలుగా పరిశీలించి.. టెస్ట్‌ రైడ్‌ అనంతరం సంతృప్తి చెందితే కస్టమర్లు కొనగోలు చేస్తారు. కానీ ఇక్కడ ఆంపియర్‌(Ampere) అనే ఈవీ కంపెనీ మాత్రం.. కస్టమర్లకు ఆ ఛాన్స్‌ ఇవ్వడం లేదు. 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకుని శభాష్‌ అనిపించుకుంది.
కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే

కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మోటర్‌హోమ్‌ను చూడవచ్చు. ఇందులో ఒక యువతి (ప్రెజెంటర్) వాహనం లోపల మొత్తం చూపించడం చూడవచ్చు. ఇందులో ఆమె మొదట డ్రైవింగ్ సీటును చూపించడంతో ప్రారంభిస్తుంది. ఇందులో కూడా డ్రైవింగ్ చేయడానికి సులభంగా ఉండే టెక్నాలజీ ఉండటం చూడవచ్చు. రెండు సోఫాలతో ఉన్న లివింగ్ రూమ్ కూడా ఇందులో చూడవచ్చు. ఒకటి కుడివైపు, మరొకటి ఎడమవైపు ఉన్నాయి.
కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - వీడియో

కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - వీడియో

కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని ఎక్కువ డ్యామేజ్‌కి గురైనప్పుడు దాన్ని విక్రయించడం లేదా నిరుపయోగంగా ఉంచడం జరుగుతుంది. ఈ రెండింటికి భిన్నంగా ఒక వ్యక్తి ప్రమాదానికి గురైన కారును మరింత దృడంగా మరియు అందంగా మార్చుకున్నాడు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.భారతదేశంలో మహీంద్రా కంపెనీ బోలెరోను 4x4 సిస్టమ్‌తో అందించేదని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నేటికీ అలాంటి కార్లు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అంతే కాకుండా ఈ కార్లపైన ఉన్న అభిమానం లేదా ఇష్టంతో మరికొందరు తమకు నచ్చినట్లు మోడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Fujiyama EV Classic రూ. 79,999 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ రేంజ్‌

Fujiyama EV Classic రూ. 79,999 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ రేంజ్‌

భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Electric Scooter) పరిచయమైంది. ఫుజియామా ఈవీ అనే సంస్థ తన సరికొత్త క్లాసిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడల్‌ను పరిచయం చేసింది. అత్యుత్తమ రైడింగ్‌ అనుభూతిని అందించేలా ఈ ఈవీని సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..