Short News

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి ముగ్గురు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్యా ముగ్గురు పిల్లలతో సహా నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏంజరిగిందో ఏమో తెలియదు కాని కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడుకు చెందిన మద్దిలేటి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగారు. వీరి గది నుంచి కేకలు వినిపించడంతో కొద్దిసేపటికి గమనించిన స్థానికులు వీరిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాజస్థాన్ కుదేలు ..చెన్నై ఘన విజయం

రాజస్థాన్ కుదేలు ..చెన్నై ఘన విజయం

టీ20 లీగ్-2018లో చెన్నై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ చతికిలపడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (106) చెలరేగి ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. లక్ష్యచేదనలో చెన్నై బౌలర్ల ధాటికి రాజస్థాన్ 18.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్ (44) ఒక్కడే కొంత పోరాట పటిమ చూపించాడు.
త‌ల్లికి పుట్టినరోజు విషెస్ చెప్పిన మ‌హేష్‌

త‌ల్లికి పుట్టినరోజు విషెస్ చెప్పిన మ‌హేష్‌

సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిర‌దేవి పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా ఆమె పాత ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే అమ్మా' అని విషెస్ చెప్తూ 'భరత్ అనే నేను' ఇన్ సినిమాస్ నౌ' ..ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేసాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రం భారీ విజ‌యం సాధించింది. ఈ సినిమా ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రంలో కైరా అద్వానీ నాయిక‌.
ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం

ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం

అక్షయ తృతీయ సందర్భంగా జువెల్లరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాయి. ప్రముఖ మొబైల్ వాలెట్‌ పేటీఎం అక్షయ తృతీయ సందర్భంగా తన బంగారం విక్రయాలను మూడు రెట్లు పెంచుకుంది. ఏ‍ప్రిల్‌ 18న 20 కేజీల బంగారాన్ని విక్రయించినట్టు తెలిపింది. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ రోజున అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని పేటీఎం వెల్లడించింది. ఎక్కువగా అమ్మకాలు బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా నగరాల్లో నమోదైనట్టు తెలిపింది. ఎక్కువగా 24 క్యారెట్‌ బంగారు నాణేలను కొనుగోలు చేసినట్టు తెలిపింది.