Short News

శ్రీ రెడ్డి...నా సందేహాలకు సమాధానం చెప్పు:సామాన్యుడు

శ్రీ రెడ్డి...నా సందేహాలకు సమాధానం చెప్పు:సామాన్యుడు

ప్రజెంట్ అన్ని రకాల తెలుగు మీడియాల్లో శ్రీరెడ్డి టైమ్ బ్రహ్మాండగా నడుస్తున్నసంగతి తెలిసిందే. తెలుగు టివి ఛానెళ్లే లోనే కాదు యూట్యూబ్ లో,ఫేస్ బుక్,వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లోనూ ఆమెదే హవా. ఇక ఇటీవలే అర్థ నగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి క్రేజ్ ముంబాయికే పాకేసింది ఆర్జీవీ అంటుంటే ఆమె చేసిన పోరాటం ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించిందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా గత నెల రెండు నెలలుగా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్ననటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ ..రోజుకు 1.4జీబీ డేటా

ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ ..రోజుకు 1.4జీబీ డేటా

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.219 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకునే కస్టమర్లకు ప్రతి రోజు 1.4జీబీ డేటాతో పాటు హలో ట్యూన్స్ ప్రయోజనం కూడా లభిస్తుంది.  28 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉండే ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1.4జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఇటీవ‌ల గ‌డ్చిరోలిలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్లో ఒక్కో మావోయిస్టు మృతదేహంలో 5 నుంచి 10 తూటాలున్న‌ట్లు పోస్టు మార్టంలో తేలింది. గడ్చిరోలి జిల్లా ఆస్పత్రి మార్చురీలో కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు గుంపులు గుంపులుగా కూర్చుని తమ వారి మృత దేహాల కోసం ఎదురు చూశారు. గడ్చిరోలిలో చాలా చోట్ల వ్యాపార వాణిజ్య సంస్ధలు మూసివేశారు. మృతుల్లో ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 42కు చేరింది. బుధవారం సాయంత్రం ఇంద్రావతిలో ఓ మృతదేహం లభించగా రాత్రికి మరో 4 మృతదేహాలను కనుగొన్నారు.    
ఆయనకు దగ్గరవుతా.. అందుకే ట్విట్టర్ ఖాతా తెరిచా: శ్రీరెడ్డి

ఆయనకు దగ్గరవుతా.. అందుకే ట్విట్టర్ ఖాతా తెరిచా: శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్‌ అంశంతో టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి మరో ఆసక్తికరమైన సోషల్ మీడియాలోని ట్విట్టర్‌లోకి ప్రవేశించారు. 'శ్రీ శక్తి' పేరుతో తాను ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లోనే దుమ్మురేపిన ఈ నటి తాజాగా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇటీవల మా అసోసియేషన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం జాతీయ మీడియాలో సంచలనం రేపింది. ఇలా వివాదాలతో ముందుకెళ్తున్న శ్రీరెడ్డి.. ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది.