Short News

వైయస్ వర్ధంతి రోజునే జగన్ సమక్షంలో వైసీపీలోకి ఆనం!

వైయస్ వర్ధంతి రోజునే జగన్ సమక్షంలో వైసీపీలోకి ఆనం!

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్‌ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దివంగత వైయస్సార్‌ హయాంలో, తదనంతర ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

మనోజ్ ప్రభాకరన్ అనే తమిళ కమెడియన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడంపై ప్రముఖ నటుడు, మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్, 'మా' ప్రధాన కార్యదర్శి నరేష్ ఫైర్ అయ్యారు. భారత దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషల్లో సినీ పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తులు, భోజ్‌పురి, హిందీ, పంజాబీ, మరాఠీ ఇన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు ఇతర భాషల్లో, వారు తెలుగు నటిస్తుంటారు. ఒక సోదర భావంతో అన్ని పరిశ్రమల నటులు ముందుకు వెళుతున్న సమయంలో ఇలాంటివి మైత్రిని దెబ్బతీస్తున్నాయన్నారు.

అత్యంత కనిష్టానికి చేరిన రూపాయి విలువ

అత్యంత కనిష్టానికి చేరిన రూపాయి విలువ

మంగళవారం డాలరు మారకంలో రూ.72.97 స్థాయిని తాకింది. ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి 46 పైసలు క్షీణించి మరో చారిత్రాత్మక కనిష్టం 73 స్థాయికి చేరువలో ముగిసింది. పెరుగుతున్న చమురు ధరలకు తోడు వాణిజ్యలోటు వర్తక లోటు, అంతర్జాతీయ అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మసాలా బాండ్లపై ఉపసంహరణ పన్ను తొలగింపు, ఎఫ్‌పీఐల సడలింపు, దిగుమతి సుంకం పెంపు, క్యాడ్‌ నియంత్రణ లాంటి చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీలో ఇబ్బందిపడిన పరిటాల సునీత

అసెంబ్లీలో ఇబ్బందిపడిన పరిటాల సునీత

ఏపీ అసెంబ్లీలో చంద్రన్న పెళ్లి కానుక వివాహ రిజిస్ట్రేషన్ పైన మంగళవారం వాడి వేడి చర్చ సాగింది. ఈ వివాహాలను పంచాయతీ కార్యదర్శులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ప్రశ్నించారు. ఈ సమయంలో సమాధానం చెప్పడానికి మంత్రి పరిటాల సునీత కొంత ఇబ్బంది పడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని కూన రవి సహా పలువురు సూచనలు చేశారు. సవరణలు అవసరం లేదని, బిల్లును ఆమోదించాలని పరిటాల సునీత కోరారు. దీనిపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ లేకుండా, సవరణలు లేకుండా ఎలా ఆమోదిస్తారని నిలదీశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more