Short News

ఈ భార్య కూడా అదే పని:ప్రియుడి కోసం భర్త హత్య

ఈ భార్య కూడా అదే పని:ప్రియుడి కోసం భర్త హత్య

ప్రకాశం:తెలుగు రాష్ట్రాల్లో ప్రియుడి మోజులో భర్తను హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకొని 24 గంటలు కూడా గడవక ముందే మళ్లీ ప్రకాశం జిల్లాలో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత అతడితో కలసి కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పాణెం ఖాసీం బీ . తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసి నిలదీయడంతో ఇక అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఎవరిని పెళ్ళి చేసుకోవాలో మాకు తెలుసు

ఎవరిని పెళ్ళి చేసుకోవాలో మాకు తెలుసు

సోషల్ మీడియా వచ్చాక సామాన్యులు కూడా సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్నారు.తాజాగా యాంకర్‌, నటి రష్మీ గౌతంకు ఒక నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు. 'కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌, మీరు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉంటారు. మీ కెరీర్‌లో ఎంతో శ్రమిస్తున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండంటూ' ట్వీట్‌ చేసాడు. ఈ విషయంపై రష్మీ స్పందిస్తూ 'మేమిద్దరం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని నీకెలా తెలుసు. స్క్రీన్‌ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్‌ లైఫ్‌, రియల్‌ కాదని తెలుసుకో.  ఎవరిని పెళ్ళి చేసుకోవాలన్నది మాకు తెలుసు' అని బదులిచ్చింది.
దుల్కర్ సినిమాలను మమ్ముట్టి ప్రమోట్‌ చేయరట

దుల్కర్ సినిమాలను మమ్ముట్టి ప్రమోట్‌ చేయరట

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ బాలీవుడ్‌కు 'కార్వాన్‌' అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. మమ్ముట్టి కొడుకైన దుల్కర్‌ తన ప్రతిభతోనే దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా లక్‌ని టెస్ట్‌ చేసుకోనున్నాడు. అయితే దుల్కర్ సినిమాలని మమ్ముట్టి ఎప్పుడూ ప్రమోట్‌ చేయరట. దానికి దుల్కర్‌ స్పందిస్తూ 'మా నాన్న ఇప్పటివరకూ నన్ను కానీ, నా సినిమాలని కానీ ప్రమోట్‌ చేయలేదు. ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండకపోవచ్చు' అని పేర్కొన్నాడు.
ఐస్‌లాండ్‌పై 'నైజీరియా' బోణీ కొట్టింది

ఐస్‌లాండ్‌పై 'నైజీరియా' బోణీ కొట్టింది

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నైజీరియా బోణీ కొట్టింది. గ్రూపు-డిలో పసికూన ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే గోల్‌ చేసే అవకాశాలు ఎక్కువగా వచ్చినా ప్రథమార్థం గోల్‌ లేకుండానే ముగిసింది. అనంతరం మొదలైన ద్వితీయార్థంలో నైజీరియా ఎటాకింగ్‌ గేమ్‌ ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 49వ నిమిషంలో నైజీరియా ఫార్వర్డ్‌ ముసా తొలి గోల్‌ చేసి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ముసా 75వ నిమిషంలో మరో గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. మ్యాచ్‌ సమయం కూడా పూర్తి కావడంతో నైజీరియా 2-0తో విజయం సాధించింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more