Short News

మంత్రి లోకేష్ ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌

మంత్రి లోకేష్ ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌

సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణితో వివాహం జరిగింది.తమ వివాహమై 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మంత్రి లోకేష్ ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది.గత 11 ఏళ్లుగా ప్రేమ, ఆప్యాయతలు నిరంతరాయంగా అందుతున్నాయని పేర్కొన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రహ్మణి అని లోకేశ్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు

బ్యాటింగ్‌ చేయమంటే ఫఖర్‌ మాధురీ దీక్షిత్‌లా డ్యాన్స్‌ చేస్తున్నాడు

బ్యాటింగ్‌ చేయమంటే ఫఖర్‌ మాధురీ దీక్షిత్‌లా డ్యాన్స్‌ చేస్తున్నాడు

ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌ వినూత్నంగా పెవిలియన్‌ చేరాడు. కుల్దీప్‌ వేసిన 14వ ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో ఫఖర్‌ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్‌ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్‌కు తాకిందని తేలింది. అప్పీల్‌కు వెళితే ఫఖర్‌ బతికిపోయేవాడు. దీంతో అభిమానులు కిందపడిపోయిన ఫఖర్‌ సీన్‌పై జోకులు వేస్తున్నారు. ఫఖర్‌.. ధావన్‌ కోసం పిచ్‌ శుభ్రం చేస్తున్నావా?' అని ఒకరు.. ఫఖర్‌ను వెంటనే జింబాంబ్వే పంపించాలని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.
ఇకపై ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ‘ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ’లు లభ్యం

ఇకపై ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ‘ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ’లు లభ్యం

ఇప్పటి వరకు ఆన్‌లైన్ స్టోర్స్, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో మాత్రమే లభించే ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ వినియోగదారులకు లభిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 9 సిటీల్లోని ఎంఐ పార్ట్‌నర్ స్టోర్స్‌లోనూ షియోమీ టీవీలు లభిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. న్యూఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ఇండోర్, పాట్నా, పూణె, ముంబై, మద్దూర్‌లలోని ఎంఐ పార్ట్‌నర్ స్టోర్స్‌లోనూ ఇకపై షియోమీ ఎంఐ టీవీలు లభిస్తాయి. త్వరలో మరిన్ని నగరాల్లో షియోమీ తన టీవీలను ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనుంది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌పై రాహుల్‌వి నిరాధారమైన వ్యాఖ్యలు

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌పై రాహుల్‌వి నిరాధారమైన వ్యాఖ్యలు

సెప్టెంబర్ 22న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓసమావేశంలో మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నియమించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఛీఫ్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఇందుకు కారణం ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఎస్పీజీ ఆఫీసర్ల జాబితాకు ఆయనకు ఆమోదం తెలపకపోవడమేనని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ఆ ఆఫీసర్ స్పందించారు. ఎస్పీజీ మాజీ డైరెక్టర్‌ వివేక్ శ్రీవాత్సవను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీవాత్సవ స్పందించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more