Short News

కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు, 2600కోట్ల నష్టం: గల్లా జయదేవ్

కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు, 2600కోట్ల నష్టం: గల్లా జయదేవ్

విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు విభజన హామీల అమలుపై మాట్లాడారు. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సహాకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామన్న కేంద్రం.. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి పెళ్లి చేసేసుకోండి

శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి పెళ్లి చేసేసుకోండి

గస్టు 15 2018 నుంచి వచ్చే నెల అంటే సెప్టెంబర్‌ లో 3వ తేదీ వరకు గ్రుహ ప్రవేశాలకు అనుకూలం. ఇక సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్‌ 10 వ తేదీ వరకు శూన్యమాసం ఉండనుంది. దీంతో అప్పుడు ఎలాంటి శుభ కార్యాలు చేసుకోవడానికి వీలుండదు. దీంతో జనాలంతా ఈ నెలలోనే శుభకార్యాలతో బిజీబిజీ అయిపోనున్నారు. సో.. మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం ఉంటే ఈ నెలంతా మీకు శుభకార్యాలకు కావాల్సిన వస్తువులు దొరికే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే మీరు అన్నీ బుక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సింది వస్తుంది.

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'గీత గోవిందం' పైరసీ గురించి ప్రస్తావించారు. సినిమా విడుదల ముందు ఈ చిత్రాన్ని కొందరు టెక్నీషియన్స్ దొంగిలించి తమ స్నేహితులతో పంచుకోవడం, రిలీజ్ ముందే సినిమా లీక్ కావడంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

భారీ వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం

భారీ వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం

హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది. రాత్రి కూడా వర్షం కురవటంతో పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు, మూడు గంటలపాటు జల్లులు కురవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more