Short News

మోడీపై సంచలనం: బీజేపీపై బుద్ధా అలా, సుజన ఇలా

మోడీపై సంచలనం: బీజేపీపై బుద్ధా అలా, సుజన ఇలా

కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని కక్ష పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఒకరు అంటే, ఆ స్థాయి వ్యక్తి అలా చేయలేరని మరొకరు చెబుతున్నారు. మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్థిక నేరస్థులకు అపాయింటుమెంట్ ఇచ్చి, సీఎం చంద్రబాబుకు ఇవ్వలేదన్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. 10 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. హల్‌మత్పొరా ప్రాంతంలో ఏడుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారంతో సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సంయుక్త బృందం ఆపరేషన్‌ చేపట్టగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో సైన్యం, భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు.

మాసబ్ ట్యాంక్‌లోని ఆదాయపన్ను శాఖ భవనంలో అగ్నిప్రమాదం

మాసబ్ ట్యాంక్‌లోని ఆదాయపన్ను శాఖ భవనంలో అగ్నిప్రమాదం

నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో బుధవారం ఆర్థరాత్రి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ఆదాయపన్ను శాఖ బిల్డింగ్‌ ఎనిమిదో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో, ఇందుకు దారితీసిన కారణాలేమిటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పవన్ ఆరోపణల్లో నిజం ఉంటుంది.. నేను నమ్ముతున్నా: పోసాని

పవన్ ఆరోపణల్లో నిజం ఉంటుంది.. నేను నమ్ముతున్నా: పోసాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తాను నమ్ముతున్నానని, ఆయన చేసిన ఆరోపణల్లో నిజం కచ్చితంగా ఉండి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడిన పోసాని పవన్‌పై ఉన్న ప్యాకేజీల స్టార్ అనే ఆరోపణలపై స్పందిస్తూ.. పవన్ డబ్బుకు లొంగే రకం కాదన్నారు. ఆయన డబ్బులు తీసుకున్నాడని అంటే తాను నమ్మనని అన్నారు. పదికి రూపాయికి అమ్ముడుపోయే నటుడు పవన్ కాదంటూ పోసాని కుండ బద్ధలు కొట్టారు.