Short News

'చంద్రబాబు పాకిస్తాన్‌కు మోస్ట్ వాంటెడ్ పర్సన్!'

'చంద్రబాబు పాకిస్తాన్‌కు మోస్ట్ వాంటెడ్ పర్సన్!'

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మరోసారి మండిపడ్డారు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిని విదేశాల్లో విమర్శిస్తే అందరినీ విమర్శించినట్లే అన్నారు. విదేశాలతో రహస్య ఒప్పందం ఉందా చెప్పాలని విష్ణు నిలదీసారు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అన్నారు. విదేశాల్లో పర్యటించినప్పుడు మోడీ గురించి చులకనగా మాట్లాడి దేశం పరువు తీస్తున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పాకిస్తాన్‌కు మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా మారారని ఎద్దేవా చేశారు.

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్ష తప్పదు. నిందితులకు మరణదండన విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం శనివారం ఆమోదించింది. పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. కతువా,ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం, మాజీ సీఎం ఆశీర్వాదం, బీజేపీ ర్యాలీలో గాలి జనార్దన్

సీఎం, మాజీ సీఎం ఆశీర్వాదం, బీజేపీ ర్యాలీలో గాలి జనార్దన్

గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ మిత్రుడు, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు శనివారం చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో నామినేషన్ వేశారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా హాజరైనారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైనారు. బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా

బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం రాజీనామా చేశారు. తరచూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తూ సంచలనంగా మారిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఆయన 'రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నా' అని ప్రకటించారు. అంతేగాక, తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని సిన్హా స్పష్టం చేశారు. జనవరిలో తాను ప్రారంభించిన రాష్ట్రమంచ్ సంస్థ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు.