Short News

వాళ్ల మాటలు వినొద్దని గడ్కరీకి చెప్పా: చంద్రబాబు

వాళ్ల మాటలు వినొద్దని గడ్కరీకి చెప్పా: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం డీపీఆర్ 1లో ఇంకా రూ.400 కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పారు. డీపీఆర్ 2 ఇచ్చి ఏడాది దాటినా కొర్రీలు వేస్తూ ఇప్పటికీ ఆమోదం తెలపలేదని ఆయన మండిపడ్డారు. కొన్ని అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారని చెప్పారు. కొన్ని శాఖలకు సంబంధించి సమాధానం కావాలని చెప్పారన్నారు. దానికి తాను కూడా స్పందించానని చెప్పారు. ఢిల్లీకి అధికారులను పంపుతామని, మొత్తం సమాచారం ఇస్తామని గడ్కరీకి చెప్పానని అన్నారు.

భాగ్యనగరంలో సైకిల్‌తో 'స్ట్రీట్ పెట్రోలింగ్'

భాగ్యనగరంలో సైకిల్‌తో 'స్ట్రీట్ పెట్రోలింగ్'

భాగ్యనగరంలో పంజాగుట్ట పోలీసులు స్ట్రీట్ పెట్రోలింగ్ పేరుతో కొత్త పోలీసింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నేటి నుంచి నాలుగు సైకిళ్ళపై పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేయనున్నారు. సైకిల్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, కమ్యూనికేషన్ అందిండానికి మాన్పాక్ట్, జీపీఎస్ సిస్టమ్, లాఠీ, ఒక వాటర్ బాటిల్ ఉంటాయి. మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులువుగా చేరుకొని అక్కడ పౌరసేవలు అందించటమే లక్ష్యంగా స్ట్రీట్ పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
మూడో వన్డేలో భారత్ చిత్తు ..సిరీస్ 'ఇంగ్లండ్'దే

మూడో వన్డేలో భారత్ చిత్తు ..సిరీస్ 'ఇంగ్లండ్'దే

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. లక్ష్యచేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు విన్స్ (27) బెయిర్ స్టో (30) త్వరగానే పెవిలియన్ దారి పట్టినా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ (100 నాటౌట్) కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 నాటౌట్) కదం తొక్కి ఆడారు. ఈ క్రమంలో వీరి జోడి ఇంగ్లాండ్ తరపున వన్డేలలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ ఇద్దరి ధాటికి ఆతిధ్య జట్టు 44.3 ఓవర్లలో 8వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మమ్ముట్టి ఆడపిల్లయితే అత్యాచారం చేసేవాడిని

మమ్ముట్టి ఆడపిల్లయితే అత్యాచారం చేసేవాడిని

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెరాన్బు'. ఈ సినిమాకు రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన దర్శకుడు మిస్కిన్‌..మమ్ముట్టి గురించి మాట్లాడుతూ తనకు ఆయనంటే ఎంత ఇష్టమో చెప్పారు. ‘ఈ సినిమాలో మమ్ముట్టి చాలా బాగా నటించారు. నేను యువకుడిగా ఉండి మమ్ముట్టి ఆడపిల్లగా పుట్టి ఉంటే అత్యాచారం చేసేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.‘మిస్కిన్‌ ప్రసంగం ఎంత చీప్‌గా ఉందో' అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more