Short News

విజయనగరం వైసీపీలో ముసలం: బొత్స కోలగట్ల వర్గాల మధ్య విభేదాలు

విజయనగరం వైసీపీలో ముసలం: బొత్స కోలగట్ల వర్గాల మధ్య విభేదాలు

విజయనగరం జిల్లా వైసీపీ నేతల్లో వ్యక్తిగత ఇమేజ్ ప్రెస్టీజియస్‌గా మారింది. పార్టీకంటే తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే అక్కడి సీనియర్ నేతలు పాట్లు పడుతున్నారు. అధికార పార్టీపై యుద్ధం ప్రకటించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు తమలో తాము గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మధ్య రాజుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. నువ్వెంత అంటే నువ్వెంతా అనే స్థాయికి పరిస్థితి చేరడంతో వీరిద్దరి వ్యవహారం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.

జీవితాలతో ఆడుకుంటున్నారు, వారిని వదలొద్దు: పోలీసులకు అనసూయ రిక్వెస్ట్

జీవితాలతో ఆడుకుంటున్నారు, వారిని వదలొద్దు: పోలీసులకు అనసూయ రిక్వెస్ట్

యాంకర్ అనసూయ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. రోడ్డుపై వాహనాలు నడిపే కొందరు వ్యక్తులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వివరిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దానికి ఇందులో ఎక్కువ శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. ఈ నేపత్యంలో హైదరాబాద్‌‌ రోడ్లపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అనసూయ దృష్టిలో పడ్డారు. దీన్ని తన ఫోన్లో రికార్డు చేసిన ఆమె హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.

బాబుకు కేసీఆర్ షాక్: ఎవరిని అవిశ్వాసం పెట్టారు.. టీఆర్ఎస్

బాబుకు కేసీఆర్ షాక్: ఎవరిని అవిశ్వాసం పెట్టారు.. టీఆర్ఎస్

తెలుగుదేశం పార్టీ అవిశ్వాసంతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు. కానీ అవిశ్వాసం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఎవరిని అడిగి పెట్టారని టీడీపీకి గట్టి షాకిచ్చారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రతి బిల్లుపై మా అభిప్రాయాలు, సూచనలు అందజేస్తామని తెలిపారు. హైకోర్టు విభజన అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. హైకోర్టు విభజన చేస్తామని గత సమావేశాల్లోనే హామీ ఇచ్చారని చెప్పారు.

అవిశ్వాసానికి దూరంగా ఉంటా: టీడీపీకి జేసీ షాక్, బుజ్జగింపు

అవిశ్వాసానికి దూరంగా ఉంటా: టీడీపీకి జేసీ షాక్, బుజ్జగింపు

అవిశ్వాస తీర్మానం సమయంలో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి ఊహించని షాకిచ్చారు. సుజనా చౌదరి తీరుతో జేసీ అలకవహించినట్లుగా తెలుస్తోంది. దీంతో తాను అవిశ్వాసానికి దూరంగా ఉంటానని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజన తనను విస్మరిస్తున్నారని సీరియస్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను అవిశ్వాసానికి హాజరు కానని తోటి ఎంపీలతో చెప్పారని అంటున్నారు. కీలకమైన అవిశ్వాసానికి ముందు జేసీ అసంతృప్తి టీడీపీని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ఆయనను బుజ్జగిస్తున్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more