Short News

పిల్లల్ని నదిలో పడేసి చంపిన తండ్రి...కారణాలు

పిల్లల్ని నదిలో పడేసి చంపిన తండ్రి...కారణాలు

తన వేధింపులకు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన భార్య...తిరిగి ఇంటికి రమ్మంటే రానందని...మద్యం మత్తులో ఒకరి తర్వాత ఒకరిని...ముగ్గురు కుమారులను నదిలో విసిరేసి...ఆ తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారి భార్య ఫోన్ చేస్తే పిల్లల్ని నదిలో విసిరేసిన సంగతి చెప్పాడు...దీంతో ఆమె నది వద్దకు వెళ్లి అక్కడ ముగ్గురు కొడుకుల మృతదేహాలు నీటిమీద తేలుతుండటం చూసి కుప్పకూలిపోయింది. ఈ విషయం తెలిసి రెండు ఊళ్ల జనాలు నది వద్దకు చేరారు. జరిగిన ఘోరాన్ని తల్చుకొని శోకసంద్రంలో మునిగిపోయారు.

అంతర్జాలాన్ని బుసలు కొట్టిస్తున్న 'భోజ్‌పురి' నాగిని

అంతర్జాలాన్ని బుసలు కొట్టిస్తున్న 'భోజ్‌పురి' నాగిని

గతంలో సినిమాల్లో నాగిని పాటలు ఎక్కువగా వచ్చేవి. ఆ కోవలో చిరంజీవి ఖైదీ చిత్రంలో వచ్చిన 'రగులుతోంది మొగలిపొద' ఎంతో ఫేమస్. ఇపుడు అదే తరహాలో వచ్చిన భోజ్‌పురి పాట ఒకటి అంతర్జాలంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నాగినీ పాటకు భోజ్‌పురి నటి పూనందుబె చేసిన నృత్యం అలరిస్తోంది. భోజ్‌పురి గాయకుడు ప్రిన్స్‌పింటూ పాడిన ‘నాగినీ' పాటకు ‘పూనందుబే' చేసిన నృత్యం నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. 'చానా జోర్ గరం' చిత్రలోని ఈ పాట పది మిలియన్ల వ్యూస్ పైగా సొంతం చేసుకుంది.
పవర్ చూపించటానికి 'సింబా' వస్తున్నాడు

పవర్ చూపించటానికి 'సింబా' వస్తున్నాడు

రణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన‌పాత్ర‌ పోషిస్తున్న చిత్రం 'సింబా'. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సారా అలీఖాన్ నాయిక. తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'టెంపర్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్, రోహిత్‌ శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని స్పెష‌ల్ వీడియోను విడుద‌ల చేసారు. కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను వీడియోలో చూపించారు. ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా డిసెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?: వాజపేయి సమాధానం ఇది!

పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?: వాజపేయి సమాధానం ఇది!

మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజపేయి ఆజన్మ బ్రహ్మచారిగా జీవనం సాగించిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆయన జీవితమంతా తపించారు. అయితే, తన వివాహం గురించిన ప్రశ్నించిన సందర్భంలో ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. 'నాకు వివాహం చేసుకునేంత సమయం లభించలేదు. బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నా' అని చెప్పుకొచ్చారు వాజ్‌పేయి. మరో సందర్భంలో 'నాకు తగిన అమ్మాయి దొరకలేదు' అని నవ్వుతూ సమాధానం ఇచ్చారట.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more