Short News

జనసేనలో చేరుతానని చెప్పలేదు: ముద్రగడ

జనసేనలో చేరుతానని చెప్పలేదు: ముద్రగడ

జనసేన పార్టీలో తాను చేరుతానని చెప్పలేదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.ఈ మేరకు ఆయన ఓ లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రాశారు.ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు.ఈ మేరకు ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి రాసిన లేఖలో ఈ విషయాన్ని ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. తన అభిప్రాయాలను జనసేన నాయకుడు రాఘవయ్య చర్చించినట్టు ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో చెప్పారు.

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.
సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

అమరావతి: సెక్స్‌వర్కర్లకు పునరావాసం కోసం ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని పలువురు సామాజిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవ అక్రమ రవాణాపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది.

మీలో క్రికెట్  టాలెంట్‌ ఉందా..?

మీలో క్రికెట్ టాలెంట్‌ ఉందా..?

టీం ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరెస్టెన్‌ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్‌ స్కౌట్‌ కార్యక్రమం ప్రారంభించాడు. భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు. టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నాడు. టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్‌ క్రికెట్‌లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు.