Short News

కొడుకు కోసం రంగంలోకి దేవేగౌడ: కేసీఆర్-చంద్రబాబు-మమతలకు ఫోన్

కొడుకు కోసం రంగంలోకి దేవేగౌడ: కేసీఆర్-చంద్రబాబు-మమతలకు ఫోన్

కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ)లకు జేడీఎస్ అధినేత దేవేగౌడ ఫోన్ చేశారని తెలుస్తోంది. జేడీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు కోరారు. వారితో పాటు బీహార్ సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను తన తండ్రిని రంగంలోకి దింపుతానని, తన తండ్రి దేవేగౌడ జోక్యం చేసుకోవాలని హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే.

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కేరళలో మొదలైన 'నిపా' కలవరంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా విస్తరించే ఈ వైరస్‌ సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. నిపా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. నిపా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి ఈ వైరస్ కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉంది.  
ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

వీక్‌ మ్యాగజైన్‌-హన్సా రీసెర్చ్‌ ఇటీవల ఉత్తమ యూనివర్సిటీలకు సంబంధించి సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నాలుగో స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సాగిన ఈ సర్వేలో జేఎన్‌యు, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు మొదటి మూడు స్థానాలు దక్కించుకోగా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశ పరంగా హెచ్‌సీయు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో వీక్‌ మ్యాగజైన్‌ సర్వేలో కూడా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది.
మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

క్యారెక్టర్ రోల్స్ తో గుమ్మడి వెంకటేశ్వర రావు తిరుగులేని నటన కనబరిచారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి వంటి గొప్ప నటులతో ఆ తరువాత తరం నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటుల చిత్రాల్లో కూడా గుమ్మడి నటించారు. ఇటీవల జరిగి ఓ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గురించి గుమ్మడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. సావిత్రితో కలసి తాను అనేక చిత్రాల్లో నటించానని గుమ్మడి అన్నారు. సావిత్రి నన్ను అన్నయ్య అని పిలిచేది.