Short News

31న టీడీపీలోకి కొండ్రు, ప్రతిభా భారతిపై వారి అసంతృప్తి!

31న టీడీపీలోకి కొండ్రు, ప్రతిభా భారతిపై వారి అసంతృప్తి!

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండ్రు మురళి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆగస్ట్ 31వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన ఆదివారం తన అనుచరులతో రాజాంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీలోకి వచ్చే అంశంపై గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌‌లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షులు కోండ్రు ఆ పార్టీని వీడి సైకిల్‌ ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు.

కాజోల్ నంబరుతో అభిమానులను 'ప్రాంక్' చేసాడు

కాజోల్ నంబరుతో అభిమానులను 'ప్రాంక్' చేసాడు

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ అభిమానులను ఆటపట్టించాడు. సోమవారం మధ్యాహ్నం అజయ్‌ 'కాజోల్‌ ప్రస్తుతం ఇండియాలో లేదు.  98******** తన వాట్సాప్‌ నంబర్‌ ఇది. ఈ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించగలరు' అంటూ ట్వీట్‌ చేసాడు. దాంతో అభిమానులు కాజల్‌తో మాట్లాడవచ్చని ఆ నంబరుకు మెసేజ్‌లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూసారు. 'రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్‌' అంటూ స్ర్కీన్‌షాట్లు తీసి అజయ్‌కు పంపించారు. 'సినిమాల్లో ప్రాంక్‌ చేసి చేసి బోర్‌ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్‌ చేసా' అంటూ చల్లగా చెప్పాడు. 
ఇది స్విట్జర్లాండ్‌లో మంచు కాదు... బెంగళూరులో

ఇది స్విట్జర్లాండ్‌లో మంచు కాదు... బెంగళూరులో

కొన్ని నెలల క్రితం నురుగుతో పొంగిన బెల్లందూర్ సరస్సు మళ్లీ ఇంతకాలానికి నురుగుతో పొంగి పాదాచారులను పలకరిస్తోంది. ఇది ఇప్పటికైతే ఈ చెరువు నుంచి వచ్చే దుర్గంధాన్ని, హానికరమైన వాయువులను బెంగళూరు వాసులు పీల్చుకోక తప్పదు. ఎందుకంటే ఇంతకుముందే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ అక్కడి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అది 10 మీటర్ల ఎత్తు వరకు పొంగి రహదారిపైకి వస్తోంది. ఈ పరిస్థితిని చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు బెంగళూరు వాసులు. సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఈ సరస్సు ఇలా పొంగింది.

ఆసియాకప్: చెలరేగిన ఆఫ్గాన్ కుర్రాళ్లు..భారత్ లక్ష్యం 253

ఆసియాకప్: చెలరేగిన ఆఫ్గాన్ కుర్రాళ్లు..భారత్ లక్ష్యం 253

ఆసియాకప్ సూపర్-4లో భాగంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేశారు. ఓపెనర్ మహ్మద్ షెజాద్(103 నాటౌట్: 88 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో షెజాద్ బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలెట్. కెరీర్‌లో అతనికిది ఐదో శతకం కావడం విశేషం.మైదానం నలువైపులా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.ఆఖర్లో ఆల్‌రౌండర్ నబీ కీలక సమయంలో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా(3),కుల్దీప్ యాదవ్(2),కేదార్ యాదవ్(1) అఫ్గాన్‌ను కట్టడి చేశారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more