Short News

మోడీ ఉన్నారని జగన్, జగన్ ఉన్నారని బీజేపీ ధైర్యం: అమర్నాథ్

మోడీ ఉన్నారని జగన్, జగన్ ఉన్నారని బీజేపీ ధైర్యం: అమర్నాథ్

కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం అన్నారు. బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు చెడ్డవారు అయ్యారని మండిపడ్డారు. 2019లో నరేంద్ర మోడీ ఉన్నారనే ధైర్యం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, జగన్ ఉన్నారనే భరోసా బీజేపీకి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ, బీజేపీ, జనసేన కుమ్మక్కు అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ మూడు పార్టీల తీరును ప్రజలు గమనించాలన్నారు.

'డ‌బ్బు కోసం క‌బ‌డ్డీ ఆడ‌ను'

'డ‌బ్బు కోసం క‌బ‌డ్డీ ఆడ‌ను'

డ‌బ్బుల కోసం కబడ్డీ ఆడనని స్పష్టం చేశాడు భారత కబడ్డీ ఆటగాడు మన్‌జీత్‌ ఛిల్లర్‌. ఈ ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌ కోసం ఆటగాళ్లకు నిర్వహించిన వేలంలో మన్‌జీత్‌ తన కనీస ధర రూ.20లక్షలకు మాత్రమే అమ్ముడుపోయాడు. ప్రొ కబడ్డీ మొదటి మూడు సీజన్లలో అదరగొట్టిన మన్‌జీత్‌ రూ.20లక్షలకు అమ్ముడుపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా మన్‌జీత్‌ దీనిపై మాట్లాడుతూ ‘డబ్బుల కోసం నేను ఎప్పుడూ కబడ్డీ ఆడను. 2003లో నేను కబడ్డీ ఆడటం ప్రారంభించినప్పుడు ప్రొ కబడ్డీ లీగ్‌ లేదు. నాకు కబడ్డీ క్రీడ నచ్చడంతోనే ఆడటం ప్రారంభించాను. నా ఆనందం కోసం ఆడతాను' అని మన్‌జీత్‌ తెలిపాడు.    
'రెండు నెల‌ల్లో కింభో యాప్ తీసుకొస్తాం'

'రెండు నెల‌ల్లో కింభో యాప్ తీసుకొస్తాం'

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా ఇటీవల పతంజలి తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్ యాప్ కింభో.. ఒక్క రోజులోనే తెరమరుగైంది. తాజాగా బాబా రాందేవ్ మాట్లాడుతూ కింభో యాప్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. కింభో యాప్ టెస్టింగ్ దశలోనే భారీగా ట్రాఫిక్‌ను ఎదుర్కొందని చెప్పారు. ప్రస్తుతం ఇది పైలట్ దశలో ఉందని, యూజర్ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో అధికారికంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఈ యాప్‌ గురించి అధికారికంగా వెల్లడించింది.    
కొత్త ఉత్ప‌త్తులు విడుద‌ల చేసిన కోకాకోలా

కొత్త ఉత్ప‌త్తులు విడుద‌ల చేసిన కోకాకోలా

కోకాకోలా ఇండియా.. హైడ్రేషన్‌, న్యూట్రిషియస్‌ డైల్యుటబుల్స్‌ విభాగాల్లోకి అడుగుపెట్టింది. ఆక్వేరియస్‌ గ్లూకోచార్జ్‌, మినిట్‌మెయిడ్‌ వింటిగో ఉత్పత్తులను విడుదల చేసింది. శుక్రవారం నాడు ఈ ఉత్పత్తులను కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్‌ టి కృష్ణకుమార్‌ మార్కెట్లోకి విడుదల చేశారు. మినరల్స్‌తో కూడిన గ్లూకోజ్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ను భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కోకాకోలా తెలిపింది. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి2, బి12 పోషకాలతో మినిట్‌ మెయిడ్‌ వింటిగోను తీసుకువచ్చినట్లు తెలిపింది.     
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more