Short News

అలా అన్నవారిని ఉరితీయాలి: నన్నపనేని సంచలనం

అలా అన్నవారిని ఉరితీయాలి: నన్నపనేని సంచలనం

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కొన్ని ఆలయాలలోకి వెళ్లడం వల్లే కేరళలో వరదలు వచ్చాయంటూ కొందరు కామెంట్లు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అలా అన్నవాళ్లను ఉరి తీయాలని నన్నపనేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం నన్నపనేని నెల్లూరులో మాట్లాడుతూ.. ఈ జిల్లా జైలులో మహిళా ఖైదీలు ఎక్కువగా వున్నారని అన్నారు. మహిళల్లో హింసను ప్రేరేపించేవిగా నేటి సీరియల్స్ ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నేరుగా మార్కెట్లోకి 'అరవింద సమేత' పాటలు

నేరుగా మార్కెట్లోకి 'అరవింద సమేత' పాటలు

ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయిక. గురువారం నేరుగా ఈ చిత్ర పాటల్ని విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబరు 1,లేదా 2న ముందస్తు వేడుకని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది.  సునీల్, ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ

ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ


పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు .
"నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః -యాత్ర్హ ఇషుశ్శివ తమా శివం బభువతే -శివా శరణ్యయా తవ తయానో రుద్ర మ్రుడయా -యాతే రుద్ర శివా తనూ రాఘోరా పాప కాశినీ -నమస్తే అస్తు భగవాన్ ,విశ్వేశ్వ రాయ ,మహాదేవాయ త్ర్యంబకాయ ,త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ ,కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీ మన్మహా దేవాయ నమః - తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ -తన్నో రుద్ర: ప్రచోదయాత్"

తెరవెనుక సైరాని నడిపిస్తున్నది అతడే.. రాంచరణ్ కోసం!

తెరవెనుక సైరాని నడిపిస్తున్నది అతడే.. రాంచరణ్ కోసం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి యుద్ధ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. తాజగా ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తిరేకెత్తించే వార్త ప్రచారం జరుగుతోంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more