Short News

నియోజకవర్గానికి రూ.40కోట్లు: టీడీపీపై పవన్ సంచలనం

నియోజకవర్గానికి రూ.40కోట్లు: టీడీపీపై పవన్ సంచలనం

తాను సినిమాల్లో సరదాగా ఉన్నా.. రాజకీయాల్లో బాధ్యతగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ చెప్పారు. పోరాట యాత్రలో భాగంగా నరసాపురంలో పవన్ ప్రసంగించారు. జిల్లా ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. అధికారం ఇస్తే బాధ్యతతో వ్యవహరిస్తానని అన్నారు. సినిమాల్లో తాను వందల కోట్లు సంపాదించవచ్చని.. కానీ, ప్రజలకు ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సీఎం అవ్వాలంటే కష్టమైన పని అని.. ఓపిగ్గా రాజకీయాల్లోకి వచ్చా.నని.. ఎంతో సహనంతో ఉన్నానని.. మీ కోసమే కాదు, మీ బిడ్డల బాగు కోసం కూడా పనిచేస్తానని యువతనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

బ్యాంకాక్ వెళుతున్న వెంకీ, వరుణ్ తేజ్!

బ్యాంకాక్ వెళుతున్న వెంకీ, వరుణ్ తేజ్!

టాలీవుడ్ మల్టీస్టార్ చిత్రాల సందడి ఎక్కువ కాబోతోంది. వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారుతున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తుంన్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. తాజగా ఈ చిత్రం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర యూనిట్ కీలకమైన షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనివుంది.

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని క్రీడా లోకం పిలుపు

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని క్రీడా లోకం పిలుపు

తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ సీఎం విజయన్ చేసిన విజ్ఞ‌ప్తికి పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. కొందరు నేరుగా సాయం చేస్తే... మరి కొందరు సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. యువ క్రికెటర్‌ సంజు శాంసన్ త‌ర‌పున అత‌డి రూ.15 లక్షల ఆర్థిక సాయం సీఎం విజయన్‌కు అందజేశారు. బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్ ప్ర‌తినిధుల‌కు విరాళాలు అందించి కేర‌ళ‌వాసులకు సాయం అందిద్దామ‌ని భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునీల్‌ ఛెత్రి ట్వీట్ చేశారు. కోహ్లీతో వివిధ క్రీడ‌ల స్టార్ ఆట‌గాళ్లు కేర‌ళ‌కు సాయం చేయాల‌ని కోరారు.   
బాలిక‌ల‌పై లైగింక దాడి.. అనాథాశ్ర‌మం నిర్వాహ‌కుడి అరెస్ట్‌

బాలిక‌ల‌పై లైగింక దాడి.. అనాథాశ్ర‌మం నిర్వాహ‌కుడి అరెస్ట్‌

దేవుడి సేవ పేరుతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎంతో మంది బాలికలను లోబర్చుకున్నాడు. కాదు.. కూడదంటే కఠిన చర్యలకు ఒడిగట్టేవాడు. ఇవి ఒంగోలులోని ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ (ఐఈఆర్‌ఎఫ్‌) నిర్వాహకుడు కొడవటికంటి జోసఫ్‌ అకృతాలు. అనాథ ఆశ్రమాలను అధికారులు చేస్తున్న తనిఖీల్లో పాస్టర్‌ బాగోతం వెలుగు చూసింది. 76 ఏళ్ల వయసులో జోసఫ్‌ చేసిన వికృత చేష్టలను జిల్లా బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి వెళ్లింది. దీంతో పాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. 46 మంది బాలికలకు బాలసదన్‌లో రక్షణ కల్పించారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more