Short News

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు,రూ.21 లక్షలు స్వా

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు,రూ.21 లక్షలు స్వా

అనంతపురం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. గతంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి బెట్టింగ్ కు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దీంతో కొంతకాలం సద్దుమణిగిన బెట్టింగ్ హడావుడి ప్రస్తుతం ఐపిఎల్ జరుగుతుండటంతో మళ్లీ జోరందుకుంది. తాజాగా అనంతపురం పట్టణంలోని సివిఆర్ హోటల్ కేంద్రంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21లక్షలు, 13 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

నటి సాయిపల్లవి 'కణం' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రానికి ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడింది. 'ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రలో షేడ్స్‌ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందానని అనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్‌ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే' అని చెప్పింది. 
క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ 'యాక్సిస్‌'కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. మొండిబకాయిలు భారంగా మారటంతో బ్యాంక్‌ రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం ఎలాంటి పెరుగుదల లేకుండా రూ.4,730 కోట్లుగా నమోదైంది. మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. గురువారం మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసాక ఫలితాలను ప్రకటించారు. దీనితో షేరు రూ.495 వద్ద ముగిసింది.
నటనా వారసత్వం అనేది ఒక భారం

నటనా వారసత్వం అనేది ఒక భారం

చిత్రసీమలో వారసత్వం అనే అంశంపై నటి కాజల్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'పుట్టుకతోనే ఎవరూ స్టార్లు కారు. వారి ప్రతిభే వారిని స్టార్లు చేస్తుంది. వారసత్వ కథానాయకులతో నేను కూడా నటించాను. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నాగ చైతన్య, కల్యాణ్‌రామ్‌ వీరంతా వారసత్వ నటులే. కేవలం వారిని స్టార్‌ వారసులుగా చూడలేం. కష్టాన్ని నమ్ముకుని పనిచేసారు కాబట్టే వారికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. నిజానికి వారసత్వం ఓ భారం' అని చెప్పుకొచ్చింది.