Short News

ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం: కంచ అయిలయ్య

ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం: కంచ అయిలయ్య

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని బీజేపీ అమలు చేయకుండా మోసం చేసిందని ప్రొఫెసర్ కంచె అయిలయ్య విమర్శించారు.ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని నిలుపుకోకుండా మోసం చేసినబిజెపికి 2019లో ఎక్కడ సీట్లు రాకూడదని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీని బిజెపి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.

నాది కూడా కథువా ఘటనలాంటిందే:షమీ భార్య

నాది కూడా కథువా ఘటనలాంటిందే:షమీ భార్య

బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో టీమిండియా పేసర్‌ మహ‍్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా హసిన్‌ షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో పోల్చుకుంది. ఒక రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. తానింకా బతికున్నానని.. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. తన క్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు.
అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.