Short News

టాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

అలనాటి ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు(87) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాసరి శిష్యుల్లో ఒకరైన దుర్గా నాగేశ్వరరావు బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి 14విజయవంతమైన సినిమాలు చేశారు. సినిమా రంగంలోకి ఆలస్యంగానే ప్రవేశించిన ఆయన.. 1979లో వచ్చిన విజయ చిత్రంతో దర్శకుడుగా మారారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ దర్శకుడిగా తనదైన ముద్ర వేయగలిగారు దుర్గా నాగేశ్వరరావు.

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

అరుణాచల్‌ప్రదేశ్‌‌ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు మొదలు పెట్టింది. 40 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు ఆదివారం ఓ మీడియా నివేదిక వెల్లడించింది. చైనా ఆధ్వర్యంలోని టిబెట్‌లోని ల్హున్జె ప్రాంతంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇది భారత్ సరిహద్దు వెంటే ఉందని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే దక్షిణ టిబెట్‌ను తన దేశంలో భాగంగా చేసుకోనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింద'ని వెల్లడించింది.
చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

పంజాబ్‌ జట్టు అద్భుతాలేమీ చేయలేదు. ప్లేఆఫ్స్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో మట్టికరించింది. మొదట లుంగి ఎంగిడి (4/10) సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేయడంతో పంజాబ్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సురేశ్‌ రైనా (61 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో చెన్నై 5 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రాయుడు (1), డుప్లెసిస్‌ (14), బిల్లింగ్స్‌ (0) విఫలమవడంతో చెన్నై 27/3తో కష్టాల్లో పడింది.  హర్భజన్‌ (19), దీపక్‌ చాహర్‌ (39) చెలరేగి ఆడి జట్టుపై ఒత్తిడి తగ్గించారు.
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.