Short News

హోదా ద్రోహులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి: చలసాని శ్రీనివాస్

హోదా ద్రోహులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి: చలసాని శ్రీనివాస్

ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడటం మొదలు పెట్టని ద్రోహులు ఎవరైనా ఉంటే ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైందని ఆయన చెప్పారు. విజయవాడలో బంద్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. ఇకనైన హోదా ద్రోహులు ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలంటూ ఎద్దేవా చేశారు.

ఆరు నెల‌ల్లో 22 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగులు నియామ‌కం

ఆరు నెల‌ల్లో 22 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగులు నియామ‌కం

దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మోదీ సర్కార్‌పై విపక్షాలు, విమర్శకులు విరుచుకుపడుతున్న వేళ ప్రభుత్వానికి తీపి కబురు అందింది. గత ఆరు నెలల్లో ( ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్‌ఓ, ఎన్‌పీఎస్‌లు జారీ చేసిన తాజా పేరోల్‌ జాబితా వెల్లడించింది. 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేలింది. గత ఆరునెలల్లో ఈఎస్‌ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా కల్పించినట్టు ప్రకటించింది.   
ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ ..రోజుకు 1.4జీబీ డేటా

ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ ..రోజుకు 1.4జీబీ డేటా

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.219 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకునే కస్టమర్లకు ప్రతి రోజు 1.4జీబీ డేటాతో పాటు హలో ట్యూన్స్ ప్రయోజనం కూడా లభిస్తుంది.  28 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉండే ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1.4జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఇటీవ‌ల గ‌డ్చిరోలిలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్లో ఒక్కో మావోయిస్టు మృతదేహంలో 5 నుంచి 10 తూటాలున్న‌ట్లు పోస్టు మార్టంలో తేలింది. గడ్చిరోలి జిల్లా ఆస్పత్రి మార్చురీలో కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు గుంపులు గుంపులుగా కూర్చుని తమ వారి మృత దేహాల కోసం ఎదురు చూశారు. గడ్చిరోలిలో చాలా చోట్ల వ్యాపార వాణిజ్య సంస్ధలు మూసివేశారు. మృతుల్లో ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 42కు చేరింది. బుధవారం సాయంత్రం ఇంద్రావతిలో ఓ మృతదేహం లభించగా రాత్రికి మరో 4 మృతదేహాలను కనుగొన్నారు.