Short News

ఆర్నెళ్ళకే దంపతుల ఆత్మహత్య

ఆర్నెళ్ళకే దంపతుల ఆత్మహత్య

ప్రేమించి పెళ్ళి చేసుకొన్న ఆరు నెలలకే ఆ దంపతులు అనుమానాస్పదస్థితిలో మరణించారు. భార్యను చంపేసి భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహలను పోస్ట్ మార్టం కోసం పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు. త్రినంద తన భార్య రేణుకను చంపేసి ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకొంది.

'సూర్య 36' షూటింగ్ మొదలుపెట్టేసిన రకుల్

'సూర్య 36' షూటింగ్ మొదలుపెట్టేసిన రకుల్

కోలీవుడ్ నటుడు సూర్య‌ 36వ చిత్రంగా 'ఎన్‌జీకే' అనే చిత్రం చేస్తున్నాడు. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి నాయిక‌లు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో దీపావ‌ళికి రిలీజ్ కానుంది. తమిళనాడు చిత్రపరిశ్రమ చేపట్టిన బంద్ సమసిపోవటంతో చిత్ర బృందం శుక్రవారం నుండి షూటింగ్ మొద‌లు పెట్టింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ టీంతో జాయిన్ అయింది. ఈ చిత్రం తర్వాత సూర్య 37వ చిత్రంగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.
ఆదివారం వస్తున్న 'నేలటిక్కెట్టు' టీజర్

ఆదివారం వస్తున్న 'నేలటిక్కెట్టు' టీజర్

రవితేజ నటిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయిక. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆదివారం టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్‌ శ్రీను, పృథ్వీ, సురేఖావాణి, ప్రవీణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఏబీడీ మెరుపులు.. బెంగళూరు విజయం

ఏబీడీ మెరుపులు.. బెంగళూరు విజయం

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రిషబ్ పంత్ మెరుపులతో 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 18.0 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (90) తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసాడు. కెప్టెన్ కోహ్లీ (30) పరుగులు చేసి బౌల్ట్ అందుకున్న అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేరాడు.