Short News

'జగన్! అన్నొస్తున్నాడంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు'

'జగన్! అన్నొస్తున్నాడంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు'

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మగా మారారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబును అరెస్టు చేయాలా అని ప్రశ్నించారు. అవినీతి సంఘానికి జగన్ అధ్యక్షుడు అన్నారు. జగన్ అవినీతి చరిత్ర బీబీసీలో కూడా ప్రసారమైందని ఎద్దేవా చేశారు.
జగన్‌పై అంతకుముందు రోజు మంత్రి దేవినేని విమర్శలు గుప్పించారు.

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్‌4లోపు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.  
కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

వరుసగా నాలుగు విజయాలు సాధించితిన దర్శకుడు, హీరోలు ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే కొరటాల శివ పేరు గుర్తుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాల తరహాలో కాకుండా.. కమర్షియల్ అంశాలు ఉంటూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల స్టైల్ అని అర్థం అయిపోయింది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఎవరితో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైపోతోంది.

క్విజ్ పోటీలో గెలిస్తే ఉచితంగా విమాన టికెట్లు

క్విజ్ పోటీలో గెలిస్తే ఉచితంగా విమాన టికెట్లు

క్విట్ పోటీలో గెలుపొందితే చాలు ఉచితంగా నెదర్లాండ్ ను సందర్శించవచ్చు. ఏప్రిల్‌ 27న నెదర్లాండ్స్‌ రాజు కింగ్‌ విలియమ్‌ అలెగ్జాండర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని జెట్‌ ఎయిర్‌వేస్‌, కేఎల్ఎమ్‌ రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానయాన సంస్థలు కలిసి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి. పోటీలో పది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారిలో రెండు జంటలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. వారికి దిల్లీ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వెళ్లడానికి టికెట్లను జెట్ ఎయిర్‌ వేస్‌ అందిస్తుంది.ఈ పోటీ ఏప్రిల్ 30 ఉదయం తొమ్మిది గంటలకు ముగుస్తుంది.