Short News

మోడీ బావా..: థర్డ్ జెండర్ వేషంలో శివప్రసాద్ నిరసన

మోడీ బావా..: థర్డ్ జెండర్ వేషంలో శివప్రసాద్ నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో, ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం విచిత్ర వేషధారణలో నిరసన తెలిపారు. గత పద్దెనిమిది రోజులుగా వారు ఆందోళన చేపడుతున్నారు. సభలో ప్లకార్డులు పట్టి నిరసన తెలుపుతున్నారు. నినాదాలు చేస్తున్నారు. ఎంపీ శివప్రసాద్ థర్డ్ జెండర్ ప్రతినిధిగా శుక్రవారం పార్లమెంటులో నిరసన తెలిపారు. మోడీ బావా.. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ ఆలపించారు. మాటలు ఎన్నో చెప్పావని, చేతల్లో మాత్రం చేయలేదని ఆరోపించారు.

ముగిసిన జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్.. మళ్లీ 30న బుకింగ్స్

ముగిసిన జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్.. మళ్లీ 30న బుకింగ్స్

జీయో ఫోన్2 మొదటి ఫ్లాష్ సేల్ కు అనూహ్య స్పందన లభించింది. గురువారం నిర్వహించిన ఫ్లాష్ సేల్ ల మొదలైన 5 నిమిషాలకే వెబ్ సైట్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. దీంతో వినియోగదారులు నిరాశ చెందారు. అయితే ఫోన్ బుక్ చేసుకున్న వారికి వారం రోజుల్లో డెలివరీ చేయనున్నారు.ఇక జియో ఫోన్ 2 కు గాను తరువాతి సేల్‌ను ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు జియో అధికారిక ప్రకటనలో తెలిపింది.
జయలలిత బయోపిక్: ఆ వివాదాలు, కేసులపైనే అందరి దృష్టి!

జయలలిత బయోపిక్: ఆ వివాదాలు, కేసులపైనే అందరి దృష్టి!

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాను ఆమె జయంతి సందర్బంగా ఫిబ్రవరి 24, 2019న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజున ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు. 'మద్రాసి పట్టణం' మూవీకి దర్శకత్వం వహించిన తమిళ ఫిల్మ్ మేకర్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నాపై జగన్ కక్ష:యరపతినేని.మోడీకి అసూయ:పుల్లారావు

నాపై జగన్ కక్ష:యరపతినేని.మోడీకి అసూయ:పుల్లారావు

తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసిపి ఇలా కుట్ర చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజల సమక్షంలోనే వైసిపి సంగతి తేలుస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్,వైసిపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సరస్వతీ భూముల విషయంలో తాను రైతులకు అండగా ఉన్నందుకే జగన్‌ తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. వైసిపి వల్లే పల్నాడులో 25 వేల మంది క్వారీ కార్మికులు రోడ్డున పడ్డారని యరపతినేని ఆరోపించారు. వైసిపి నిజ నిర్ధారణ కమిటీలో అందరూ దోపిడీ దొంగలేనని యరపతినేని దుయ్యబట్టారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more