Short News

మావోల చేతిలో తెలుగు ఇంజనీర్ హతం

మావోల చేతిలో తెలుగు ఇంజనీర్ హతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ నెల 14న కిడ్నాప్ చేసిన ఇంజనీర్ బాలనాగేశ్వర రావును దారుణంగా హత్య చేశారు.

రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా పైదగూడ దగ్గర ఇంజినీర్‌ బాలనాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు కార్మికులని కిడ్నాప్‌ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన కార్మికులను అదే రోజు విడిచిపెట్టినప్పటికీ బాలనాగేశ్వరరావును మాత్రం విడిచిపెట్టలేదు.

కాగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలనాగేశ్వరరావు సుకుమాజిల్లా పాయిదాగూడవద్ద రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ టివి ఛానెల్!...పేరు జె టివి?...నిజమేనా?

పవన్ కళ్యాణ్ టివి ఛానెల్!...పేరు జె టివి?...నిజమేనా?

పవన్ కళ్యాణ్ ఛానెల్ పెడుతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్...కారణం సింపుల్...మీడియాపైనే యుద్దం ప్రకటించిన పవన్ మరి తానే మీడియా ఓనర్ గా మారుతున్నారంటే వెరీ ఇంట్రెస్టింగే కదా!...ఇంతకీ ఇది నిజమేనా?...అంటే ఇప్పటికిప్పుడు ఎవ్వరూ నిర్థారించలేకపోయినా...ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితులను బట్టి ఈ వార్త నిజమేనేమోనని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జె టివి అనే లోగో...క్యాప్షన్...ఇంత పక్కాగా డిజైన్ చేశారంటే ఖచ్చితంగా పవన్ ఛానెల్ పెడుతూ ఉండవచ్చనేది అత్యధికుల భావన.

'రేస్ 3' కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

'రేస్ 3' కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌స్తుతం రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వంలో 'రేస్ 3' చిత్రాన్ని చేస్తున్నాడు. జూన్ 15న విడుద‌ల కానున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క సాంగ్‌ని చిత్రీక‌రించేందుకు స‌ల్మాన్ అండ్ టీమ్ త్వ‌ర‌లో క‌శ్మీర్‌కి వెళ్ళ‌నుంది. లీ, ల‌డ‌ఖ్ ప్రాంతాల‌లో మూడు రోజుల పాటు చిత్ర బృందం అంతా క‌శ్మీర్‌లోనే ఉంటుంది. భ‌జ‌రంగీ భాయిజాన్ తర్వాత సల్మాన్ క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ చేస్తున్న సినిమా ఇదే. ఈ  చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక‌.
ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక తానే ఉన్నానంటూ వర్మ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీపై నెగటివ్ కామెంట్స్ చేయనని ఒట్టేసిన వర్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. 'నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టు వేసా. ఆ తర్వాత నేను, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవిప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడంతో మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను'' అని ట్వీట్‌ చేసాడు.