Short News

నెల్లూరులో టీడీపీ-వైసీపీ తీవ్ర ఘర్షణ

నెల్లూరులో టీడీపీ-వైసీపీ తీవ్ర ఘర్షణ

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మారుపూరు ఎస్సీ కాలనీలో వైసీపీ-టీడీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి.

కారణమేంటో తెలియదు కానీ.. ఇరు వర్గాలు తీవ్రంగా తలపడ్డాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన కొందరు గాయాలపాలయ్యారు. అనంతరం టీడీపీ నేతలు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లపై దాడి చేసి వైసీపీ నేతలు బంగారం దోచుకెళ్లారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గొడవకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.


ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక తానే ఉన్నానంటూ వర్మ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీపై నెగటివ్ కామెంట్స్ చేయనని ఒట్టేసిన వర్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. 'నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టు వేసా. ఆ తర్వాత నేను, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవిప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడంతో మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను'' అని ట్వీట్‌ చేసాడు.  
బాబోయ్ ..ఎండలు ..మరో రెండు రోజులు ఇంతే.!

బాబోయ్ ..ఎండలు ..మరో రెండు రోజులు ఇంతే.!

తెలంగాణా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుజరాత్‌ నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావం తెలంగాణపై పడుతున్నదని పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల పెరగవచ్చని తెలిపింది. శుక్రవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.
ఏటీఎంలకు పూజలు చేస్తున్నారు ..కానీ

ఏటీఎంలకు పూజలు చేస్తున్నారు ..కానీ

దేశంలో మరోసారి నోట్ల రద్దు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంలలో నగదు రాకపోవడంతో ప్రజలు తాము పడుతున్న అవస్థలను ఏటీఎంలకు విన్నవించుకున్నారు. కాన్పూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు ఏటీఎంకు హారతులిచ్చి, 'ఏటీఎం తల్లీ..మా డబ్బులు ప్రసాదించమ్మా' అని వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపారులంతా పూమాలలు, అగరుబత్తీలు తీసుకుని ఏటీఎం దగ్గర 'ఓం జై జగదీశ' అంటూ పాటనందుకుంటూ ఏటీఎంకు హారతులిచ్చారు.