Short News

జగన్ పాదయాత్ర, విజయవాడ పోలీసులపై తప్పుడు ప్రచారం

జగన్ పాదయాత్ర, విజయవాడ పోలీసులపై తప్పుడు ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తున్న వాహనచోదకులపై విజయవాడ పోలీసుల దౌర్జన్యం అంటూ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో తప్పుడు వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరు పేస్‌బుక్ పేజీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు రంగం సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనను విజయవాడ పోలీసులకు ఆపాదిస్తూ తప్పుడు వీడియోను పోస్టు చేశారు. దీనిపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఆ వీడియో ఏపీకి సంబంధించినది కాదని గుర్తించారు.

టీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు

టీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు

టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డులో అనితను నియమించడంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. దీంతో ఎమ్మెల్యే అనిత వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారులను నివేదిక కోసం ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా అనితపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మ‌రోవైపు టీటీడీ సభ్యురాలిగా తనను తప్పించాలని అనిత‌నే సీఎం చంద్రబాబుకు ఇటీవ‌ల లేఖ రాశారు.   
ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో 'వరల్డ్‌ టీ20'

ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో 'వరల్డ్‌ టీ20'

ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఇక నుంచి కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీని స్థానంలో వరల్డ్‌ టీ20 టోర్నీ జరపాలన్న ఐసీసీ నిర్ణయానికి తాజాగా తొలి అడుగుపడింది. షెడ్యూల్‌ ప్రకారం 2021లో భారత్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉండగా దాని స్థానంలో టీ20 వరల్డ్‌ కప్‌ను నిర్వహించడానికి ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఐసీసీ గ్లోబల్‌ బాడీ ఏకగీవ్ర ఆమోదం తెలిపినట్లు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు. వరల్డ్‌ టీ20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు నిర్ణయం తీసుకుంది.  
కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆధారపడితే కష్టమే

కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆధారపడితే కష్టమే

ప్రతి ఏడాది టీ20 లీగ్ లోనూ ట్రోఫీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న బెంగళూరు ఇంతవరకూ ఫెయిలవుతూనే వచ్చింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ మీదనే ఈ జట్టు అతిగా ఆధారపడుతూ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఎక్కువ ఓటములు చవిచూడాల్సి వస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కోహ్లీ-ఏబీడీ ద్వయం విఫలమయ్యారంటే పాయింట్ల పట్టికలో బెంగళూరు అట్టడుగు స్థానంలో నిలుస్తుందన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనిఅంటున్నారు. ఈ సీజనులో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడగా ఏబీ డివిలియర్స్‌ 280 పరుగులు, విరాట్ కోహ్లీ 249 పరుగులు చేసారు.