Short News

ప్ర‌త్యేక హోదా కోసం రాజ‌ధాని రైతుల బైక్ ర్యాలీ

ప్ర‌త్యేక హోదా కోసం రాజ‌ధాని రైతుల బైక్ ర్యాలీ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ‌ధాని అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండ రాయుని పాలెం వద్ద ఎమ్మెల్యే రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఏప్రిల్ 20న సీఎం దీక్ష‌కు మ‌ద్ద‌తుగా అమరావతి ప్రాంత రైతులంతా దీక్ష చేస్తారని వెల్లడించారు.   
ఏపీలో బీజేపీకి గట్టి దెబ్బ: వైసీపీలోకి కన్నా-కాటసాని

ఏపీలో బీజేపీకి గట్టి దెబ్బ: వైసీపీలోకి కన్నా-కాటసాని

ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో ఇరుకునపడ్డ బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో మరో షాక్. ఇద్దరు కీలక నేతలు త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బుధవారం వైసీపీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ సమక్షంలో ఎల్లుండి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా బీజేపీని వీడి ఈ నెల 29న వైసీపీలో చేరనున్నారు.

రిటైర్ మెంట్ ఎప్పుడో  ''అప్పుడు''  ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

రిటైర్ మెంట్ ఎప్పుడో ''అప్పుడు'' ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

టీమిండియా హార్డ్ హిట్ట‌ర్ యువ‌రాజ్ సింగ్ త్వ‌ర‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నాడా? ఈ ప్ర‌శ్న‌కు తాజాగా యువ‌రాజ్ సింగ్ జ‌వాబు చెప్పాడు. `నేను 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే ఫార్మాట్ ఏదైనా 2019 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు క్రికెట్ ఆడాల‌నుకుంటున్నా. వ‌చ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జ‌రిగే 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాల‌నుకుంటున్నా. ఆ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా. అప్ప‌టివ‌రకు వేచి చూసి రిటైర్మెంట్‌పై నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా` అని యువీ చెప్పాడు.  
భరత్ అనే నేను చిత్రంపై ఆసక్తిగా ఉన్న రజినీకాంత్.. త్వరలోనే!

భరత్ అనే నేను చిత్రంపై ఆసక్తిగా ఉన్న రజినీకాంత్.. త్వరలోనే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మహేష్ ఫెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం గురించి తెలుసుకున్న రజినీకాంత్ త్వరలోనే చిత్రాన్ని చూడాలని ఆశ పడుతున్నారట. కాగా ఈ చిత్రంలో తమిళంలో రీమేక్ కాబోతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. ఈ చిత్రంపై తమిళ స్టార్ హీరోలందరి కన్ను పడ్డట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.