Short News

అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు

అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు

దేశంలోని అత్యంత సంపన్న సీఎం జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నెంబర్ వన్ గా నిలిచారు. ఎన్నికల సంస్కరణల కోసం ఏడీఆర్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో చంద్రబాబును ధనిక సీఎంగా ప్రకటించింది. 31మంది ముఖ్య మంత్రుల్లో చంద్రబాబుకు రూ.177 కోట్లకుపై ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూ రూ.129 కోట్లతో రెండో స్థానంలో ఉండగా..పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ రూ.48కోట్లతో మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సహజీవనం చేస్తున్న హనుమంతును వివాహం చేసుకోవాలని ప్రియురాలు సరిత కోరింది. అయితే అప్పటికే వివాహమై పిల్లలున్నా హనుమంతు నిరాకరించడంతో దీంతో సరిత హనుమంతును హత్యచేసింది. ఈ కేసులో సరితకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.