Short News

కన్నడ నేలపై ఏపీ ప్రత్యేక హోదా నినాదం

కన్నడ నేలపై ఏపీ ప్రత్యేక హోదా నినాదం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదం టీ20 లీగ్-2018ను కూడా తాకింది. ఆదివారం బెంగళూరు వేదికగా రాజస్థాన్‌, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీల్లో కొంతమంది ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. కన్నడ సీమలో తెలుగువారు గణనీయంగా ఉన్న నేపధ్యంలో అక్కడ కూడా 'హోదా' నినాదం వినిపించడం ప్రత్యేకతను సంతరించుకుంది.మరో వైపు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది.
''చ‌ట్ట స‌భ‌ల్లో క్యాస్టింగ్ కౌచ్ లేద‌నుకుంటున్నారా?''

''చ‌ట్ట స‌భ‌ల్లో క్యాస్టింగ్ కౌచ్ లేద‌నుకుంటున్నారా?''

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళా నేత రేణుకా చౌదరి స్పందించారు. ఒక్క చలన చిత్ర పరిశ్రమలోనే కాదని, ప్రతీ చోట వేధింపులు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన రేణుకా చౌదరి చట్ట సభల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. వేధింపులకు పార్లమెంటు మినహాయింపేమీ కాదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
నాకేమైనా జరిగితే రక్షణగా ఉండండి: బాబు సంచలనం

నాకేమైనా జరిగితే రక్షణగా ఉండండి: బాబు సంచలనం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. తనకు ఏదైనా జరిగితే తనకు రక్షణ వలయంగా ఉండాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.తనకు ఏమైనా జరిగితే తనకు రక్షణగా నిలబడాలని చంద్రబాబునాయుడు కోరారు,25 ఎంపీలను గెలిపిస్తే ప్రధానిని తామే నిర్ణయించనున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.బ్యాంకులను దోచుకొన్నా కేంద్రం ఏం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలు

ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలు

మరో ప్రాణికి జీవం పొసే వరం మహిళలకి మాత్రమే సొంతం. భారతీయులు ఈ విషయాన్ని వరంగా భావిస్తారు. పాపాయికి జన్మనివ్వడానికి ముందు దంపతులు ఎన్నో విధాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

లైఫ్ స్టయిల్ లో మార్పులు, డైట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు ఆల్కహాల్ ను అలాగే స్మోకింగ్ ను పూర్తిగా విడిచిపెడతారు. అడ్వాన్స్ గా జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నప్పటికీ ప్రెగ్నన్సీకి సంబంధించిన మొట్టమొదటి లక్షణాలను గమనించడంలో మాత్రం విఫలమవుతారు. వీటి గురించి వారికి అవగాహన లేకపోవటం ఒక కారణం కావచ్చు.