Short News

ఓటు హక్కును బదిలీ చేసుకున్న చంద్రబాబు

ఓటు హక్కును బదిలీ చేసుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరబాద్ లో తన ఓటు హక్కును వదులుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న నారావారు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణిలు కూడా తమ ఓట్లను బదిలీచేయించుకున్నారు. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం తెలిసిందే.
ఇవిగో ఆధారాలు.. పవన్ అమరావతి ఇంటిపై జనసేన ట్వీట్

ఇవిగో ఆధారాలు.. పవన్ అమరావతి ఇంటిపై జనసేన ట్వీట్

అత్యంత ఖరీదైన అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండెకరాల భూమిని అతి తక్కువ ధరకే కొన్నారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ విమర్శలను తిప్పికొడుతూ.. జనసేన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ఆ స్థలం ఎప్పుడు కొన్నది? ఎంతకు కొన్నది? ఎవరి వద్ద కొన్నది వంటి పూర్తి వివరాలతో డాక్యుమెంట్స్‌ను ఆధారాలుగా చూపిస్తూ ట్వీట్ పెట్టింది జనసేన.
అధికారికంగా రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ చెల్లించే అక్కడ ఇళ్లు కడుతున్నట్టు అన్ని ఆధారాలను ట్వీట్‌లో పొందుపరిచారు.

స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్

స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన విషయంలో లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ వైఖరిని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తప్పుపట్టారు. నిబంధనలంటే లెక్కలేని రీతిలో కేంద్ర ప్రభుత్వం, స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్రంపై బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం చరిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఓటమి బాటలో ఉన్న పార్టీలతో జతకట్టిన చంద్రబాబుకు పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

జేఎన్‌యూలో ఉద్రిక్తత... పోలీసులతో విద్యార్థుల బాహాబాహీ!

జేఎన్‌యూలో ఉద్రిక్తత... పోలీసులతో విద్యార్థుల బాహాబాహీ!

లైంగిక వేధిపుల ఆరోపణలపై జేఎన్‌యూ ప్రొఫెసర్ అరెస్టుకు విద్యార్థులు చేస్తున్న డిమాండ్ సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అతుల్ జోహ్రిని తక్షణం అరెస్టు చేయాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఢిల్లీ వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.