Short News

ఏయ్ వింటావా? లేదా? నీకంటే తెలివైనోడ్ని!: రైతుపై బాబు ఆగ్రహం, ఏం జరిగిందంటే?

ఏయ్ వింటావా? లేదా? నీకంటే తెలివైనోడ్ని!: రైతుపై బాబు ఆగ్రహం, ఏం జరిగిందంటే?

ప్రభుత్వం తీరుపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఓ రైతుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబుతో పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సభలోనే కొందరు రైతులు ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ అడుగు ముందుకేసిన ఓ రైతు ప్రభుత్వంపై బాబు సమక్షంలోనే విమర్శలు గుప్పించాడు.

బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు..

బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు..

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌పై బుధవారం ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజ్‌తోపాటు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఆయన ప్రకటించారు. బుధవారం లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్-2018 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రక్షణ కారిడార్ కేటాయింపుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మోడీ చెప్పారు.

ఈ ఏడాది పెళ్ళి చేసుకోనున్న 'రోబో' సుందరి

ఈ ఏడాది పెళ్ళి చేసుకోనున్న 'రోబో' సుందరి

నటి అమీ జాక్సన్‌ బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త జార్జితో పెళ్ళిపీటలెక్కబోతోంది. వ్యాలెంటైన్స్‌ డే రోజున అమీ ప్రియుడితో కలిసి ఉన్న ఫొటో పోస్ట్‌ చేయడంతో ప్రేమ విషయం అందరికీ తెలిసింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాదే వీరిద్దరి పెళ్ళి జరగాల్సి ఉండగా అమీ సినిమాలతో బిజీగా ఉండడంతో వాయిదా వేసినట్లు సమాచారం. అమీ జాక్సన్‌ ప్రస్తుతం '2.0 సినిమాతో బిజీగా ఉంది.
ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు!

ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు!

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల ఉన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తోన్న ఉపాధ్యాయురాలితో అదే పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్ కొన్ని నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఉపాధ్యాయురాలి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలతోపాటు, ఫొటోలు పంపిస్తున్నాడు. దీంతో ఆమె తన భర్తకు, ఇతర కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వివరించింది. వారు సదరు ఉపాధ్యాయుడిపై ఇటు పోలీసులకు, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.