Short News

నేడు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.. కడప, రాజంపేట నేతలతోనూ...

నేడు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.. కడప, రాజంపేట నేతలతోనూ...


టీడీపీ ముఖ్యనేతలతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌

ఫిబ్రవరి 20కి క్రికెట్ చరిత్రలో ఓ చిరిగిపోని పేజీ ఉంది. 18 ఏళ్ల క్రితం అంటే 20-02-1990న న్యూజిలాండ్ బౌలర్ బ్రెట్ వేన్స్ ఒకే ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో 1 ఓవర్ వేసిన బ్రెట్ మొత్తం 17 నోబాల్స్ వేశాడు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ ఐదు సింగిల్స్, ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సులు బాదాడు. బ్యాట్స్‌మెన్ లీ జర్మొన్ ఒకడే 70 పరుగులు చేశాడు. ఈ ఓవర్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.
గీతాంజలి డైమండ్స్ ఉద్యోగుల ఆందోళన

గీతాంజలి డైమండ్స్ ఉద్యోగుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ర్యావిర్యాల పరిధిలోని సంగీత డైమండ్ కంపెనీ సీజ్‌తో ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. దీంతో కార్మికులంతా కంపెనీ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు . 250 ఎకరాల్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు గీతాంజలి జెమ్స్ అండ్ జ్యూయలరీగా మారింది. పంజాబ్ నేషనల్ స్కామ్ కేసులో నీరవ్ మోదీకి చెందిన ఆస్తులు జప్తు చేసే క్రమంలో గీతాంజలి జెమ్స్ అండ్ జ్యూయలరీలో ఈడీ అధికారులు తనిఖీలు చేసి, సీజ్ చేశారు. ఉద్యోగాలు ఊడిపోవ‌డంతో కార్మికులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.
పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

టెలికాం కంపెనీ ఐడీయా సెల్యూలార్ ..పానాసోనిక్ పీ 100 మొబైల్ పై రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ఆఫర్ లో భాగంగా రూ.5,299 ఫోన్ ను రూ.3,799 కే అందిస్తోంది. వినియోగదారులు మొదట ఫోన్‌ను రూ.5,299కు కొనుగోలు చేయాలి. అనంతరం అందులో ఐడియా సిమ్‌ను వినియోగించాలి. అప్పుడు నెలకు రూ.199 లేదా ఆపైన విలువ గల ప్లాన్‌ను వాడాలి. మొదటి 12 నెలల పాటు చేస్తే కస్టమర్లకు రూ.300 క్యాష్ బ్యాక్ వస్తుంది. మరో 12 నెలల పాటు ఇలాగే వాడితే మరో రూ.1200 క్యాష్ బ్యాక్ ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.3,799కే లభిస్తునట్టవుతుంది