Short News

అంబులెన్స్ లేక బైక్‌ పై మృత‌దేహం త‌ర‌లింపు

అంబులెన్స్ లేక బైక్‌ పై మృత‌దేహం త‌ర‌లింపు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండ‌లం వట్టిగడ్డ గ్రామంలో హృద‌య విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అంబులెన్స్ సమస్యతో మృత‌దేహాన్ని బైక్ పై త‌ర‌లించారు.  అపస్మారక స్థితిలో ఉన్న నికి చెందిన గవిరెడ్డి (58) అనే రైతును కుటుంబ సభ్యులు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అయితే గ‌విరెడ్డి అప్ప‌టికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహాం గ్రామానికి తరలించేందుకు పీహెచ్‌సీ అంబులెన్స్‌ డీజిల్‌ లేదని చెప్పారు. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్తోమత లేక,  మోటారు సైకిల్‌పై మధ్యన కూర్చోబెట్టుకుని తరలించడం స్థానికులను కలచివేసింది.
బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బిహార్‌లో బోర్డు పరీక్షలు అంటేనే చర్చనీయమైన అంశంగా మారుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి అధికార యంత్రాంగం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. పరీక్షలకు బూట్లు, సాక్సులు వేసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ స్లిప్పర్స్‌ లేదా ఫ్లిప్‌ఫ్లాప్స్‌ వేసుకురావాలని సూచించింది. ఫిబ్రవరి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలోని గూడూరు మండలం టేకులతండాలో ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.

అక్రమ సంబంధమే ఆ మహిళ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్ారు. వినోద అనే ఆ మహిళను చంపిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఆమె మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తం మడుగులో కనిపించింది. తల, మొండెం వేర్వేరుగా పడేశారు.

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెడ్‌మి నోట్ 5తో మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ మీద ఆసక్తి లేనివారు వేరే ఫోన్లో ఇదే ఫీచర్లు ఉంటే బావుండునని ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 5తో పోటీపడే ఓ అయిదు ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.