Short News

ఏపీ సీఎం చంద్రబాబుకు దేవెగౌడ ఫోన్

ఏపీ సీఎం చంద్రబాబుకు దేవెగౌడ ఫోన్

కర్నాటక రాజకీయాలు రసకందాయంగా మారాయి. గవర్నర్ విజుభాయ్ వాలా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వడంతో జేడీఎస్,కాంగ్రెస్ న్యాయపోరాటానికి సైతం వెనకడాలేదు.అయితే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయమద్దతు కూడగట్టేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేడీఎస్ అధినేత దేవెగౌడ ఫోన్ చేశారు. కర్ణాటకలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబుకు వివరించారు.అయితే, ఈ విషయంపై మాట్లాడాలా? వద్దా? అనే విషయంపై టీడీపీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళుతూ ఐదుగురి దుర్మ‌ర‌ణం

తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళుతూ ఐదుగురి దుర్మ‌ర‌ణం

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని మాముండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బొలెరో-డీసీఎం వాహనాలు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. డీసీఎం వాహనంలో చిక్కున్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లా కడివేముల మండలానికి చెందిన మధు కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వస్తుండగా ఈ ఘోరం జరిగిందని డీఎస్పీ చెప్పారు.   
'గామ‌న్ వెలుగులు'.. చూప‌రుల‌కు క‌నువిందు

'గామ‌న్ వెలుగులు'.. చూప‌రుల‌కు క‌నువిందు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న గామన్‌ వంతెన రాత్రి వేళల్లో విద్యుత్‌ కాంతులతో ఇలా ధగధగలాడుతోంది. సుమారు 4 కిలోమీట‌ర్ల‌ పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ దీపాలు రాత్రి వేళల్లో ఇలా తళుకులీనుతున్నాయి. దిగువన గోదావరి నదిలోనూ ఈ కాంతుల తాలూకూ సోయగాలు ప్రతిబింబిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా మరింత శోభాయమానంగా కనిపిస్తూ చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.   
Bhojpuri Actress Manisha Rai Killed in Road Accident

Bhojpuri Actress Manisha Rai Killed in Road Accident

భోజ్‌పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. షూటింగులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుండి వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమీప ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో తన అసోసియేట్‌ సంజీవ్ మిశ్రాతో కలిసి మనీషా రాయ్ బయల్దేరిందని, ఈ ప్రమాదంలో సంజీవ్ మిశ్రా గాయాలతో బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.