Short News

పెళ్లికళ వచ్చేస్తోంది! 24 నుంచి భారీగా, ఆ ఒక్కరోజే వేలాది పెళ్లిళ్లు, మే 13 వరకే, ఆపై అధిక మాసం

పెళ్లికళ వచ్చేస్తోంది! 24 నుంచి భారీగా, ఆ ఒక్కరోజే వేలాది పెళ్లిళ్లు, మే 13 వరకే, ఆపై అధిక మాసం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలవనుంది. సంబంధాలు కుదుర్చుకుని మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేకపోయిన వేలాది మంది వధూవరులు ఇక వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా బాజాభజంత్రీల సందడే లేదు. మాఘ మాసం వచ్చినా.. నవంబరు నెలాఖరునుంచే మూఢం ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఫిబ్రవరి 19 నుంచి మూఢం వీడనుంది.. దీంతో మళ్లీ బాజాభజంత్రీలు మోగనున్నాయి.

అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలోని గూడూరు మండలం టేకులతండాలో ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.

అక్రమ సంబంధమే ఆ మహిళ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్ారు. వినోద అనే ఆ మహిళను చంపిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఆమె మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తం మడుగులో కనిపించింది. తల, మొండెం వేర్వేరుగా పడేశారు.

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెడ్‌మి నోట్ 5తో మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ మీద ఆసక్తి లేనివారు వేరే ఫోన్లో ఇదే ఫీచర్లు ఉంటే బావుండునని ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 5తో పోటీపడే ఓ అయిదు ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు !

గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు !

మహిళల గర్భదారణ సమయంలో, సాధారణ మందులు (లేదా) మాత్రల కన్నా మంచి శక్తిని అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, వారంతా కోరుకుంటారు. గర్భస్రావం ఒక మహిళ యొక్క జీవితంలో చాలా సున్నితమైన దశ, ఈ దశలో ఆమె తన శరీరం లోపల నుండి మరొక జీవిని సృష్టించేందుకు - ఆమె శరీరం తోడ్పడుతుంది.

గర్భిణి స్త్రీలు సరైన పోషకాహారాలను తీసుకోకపోవటం వల్ల ఆమెలో బలము మరియు రోగనిరోధక శక్తి ఎలా అయితే తగ్గుతాయో, అలానే పుట్టబోయే బిడ్డలో కూడా తగ్గుతుంది.