Short News

ఏపీ నేతలకు కత్తి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ఏపీ నేతలకు కత్తి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ప్రేమికుల రోజును సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఏపీ రాజకీయ నేతల ప్రేమలపై తనదైనశైలిలో సెటైర్లు విసిరారు. మోదీ అంటే చంద్రబాబుకు ప్రేమ.. చంద్రబాబు అంటే పవన్‌ కల్యాణ్‌కు ప్రేమ.. పవన్‌ కల్యాణ్‌ అంటే జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రేమ.. హ్యాపీ వాలెంటైన్స్‌ డే అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.ఏపీ జేఎఫ్‌ఎఫ్‌సీ పేరిట పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న రాజకీయాలపై కత్తి మహేష్ ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు క్షమించారు, బీజేపీకి సిద్దూ

గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు క్షమించారు, బీజేపీకి సిద్దూ

కర్ణాటక రాష్ట్రం క్షేమం కోసం తాను గాలి జనార్దన్ రెడ్డిని క్షమించానని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప చెప్పారని ఓ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురించారు. ఈ వార్తను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గమనించారు. రాష్ట్రం క్షేమం అంటే ఏమిటీ, గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు క్షమించారు అంటూ బీఎస్. యడ్యూరప్పను కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని సీబీఐకి సూచించి గాలి జనార్దన్ రెడ్డిని క్షమించమని చెప్పాలని మీరు ఈ విదంగా అడిగారా ? అని మాజీ ముఖ్యమంత్రి బీఎస్.

భూపాలపల్లి జిల్లాలో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

భూపాలపల్లి జిల్లాలో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు అడవుల్లో శుక్రవారంనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో శుక్రవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మర్రిమల్ల,అన్నారం, మద్దెడు, వెంకటాపురం ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, మావోయిస్టులకు మధ్య శుక్రవారం నాడు ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఇద్దరు. తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం.

రెడీగా ఉండండి.. త్వరలోనే సవ్యసాచి ట్రీట్.. యూఎస్ వెళుతోన్న చైతు!

రెడీగా ఉండండి.. త్వరలోనే సవ్యసాచి ట్రీట్.. యూఎస్ వెళుతోన్న చైతు!

నాగచైతన్య నటిస్తుం లేటెస్ట్ మూవీ సవ్య సాచి. ప్రముఖ దర్శకుడు చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్, ఫ్యామిలీ అన్ని అంశాలు కలగలిపిన చిత్రంగా సవ్య సాచి రాబోతోంది. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. హీరో హీరోయిన్లపై ఓ డ్యూయెట్ కోసం చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మే 2 నుంచి 12 వరకు చైతు, నిధి అగర్వాల్ పై సాంగ్ ని యుఎస్ లో చిత్రీకరించనున్నారు. షూటింగ్ పూర్తికావస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే సవ్యసాచి టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.