Short News

బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం, జగన్‌కు దమ్ముంటే ఈరోజే..: జేసీ సంచలన వ్యాఖ్యలు

బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం, జగన్‌కు దమ్ముంటే ఈరోజే..: జేసీ సంచలన వ్యాఖ్యలు

విశాఖ రైల్వే జోన్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ చిన్న అంశమే కానీ అది ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు, రైల్వో జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఒక గట్టి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్ రాక, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ: నాగబాబు వార్నింగ్

పవన్ కళ్యాణ్ రాక, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ: నాగబాబు వార్నింగ్

తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, వారి దుమ్ము దులిపేందుకు కళ్యాణ్ వస్తున్నాడని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ అంటూ పవన్ అంశంపై స్పందించారు. పవన్, చెర్రీ, బన్నీ ఇలా మెగా కుటుంబానికి మొత్తానికి చిరంజీవి దారి చూపించారని అందుకు అన్నయ్యకు థ్యాంక్స్ అన్నారు.

ఏప్రిల్ 27న ‘కణం’ విడుదల

ఏప్రిల్ 27న ‘కణం’ విడుదల

నాగశౌర్య, సాయి పల్లవి కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం 'కణం' ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన 'కణం' ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది.‘‘సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య‌ల‌తో చేసిన కణం ఓ ఎమోష‌న‌ల్ మూవీ అని చెప్పారు ఎన్‌.వి.ప్ర‌సాద్. దర్శకుడు విజయ్ గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా తెర‌కెక్కించారు. శామ్ సి.ఎస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, నిర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం. ఆల్‌రెడీ విడుద‌లైన ట్రైల‌ర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది.