Short News

ఢిల్లీ ధర్నాకు జెండా ఊపుతా! 6న ఎంపీల రాజీనామా, పోరాటం ఆగదు: జగన్ సంచలన ప్రకటన

ఢిల్లీ ధర్నాకు జెండా ఊపుతా! 6న ఎంపీల రాజీనామా, పోరాటం ఆగదు: జగన్ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన పాదయాత్రలో సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లాలోని కలిగిరిలో 86వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని.. ఈ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని అన్నారు.

ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు !

ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు !

మదురై కామరాజర్ యూనివర్శిటీలో పై అధికారుల దగ్గరకు కాలేజ్ అమ్మాయిలను పంపించి వారి కోరికలు తీర్చాలని సెక్స్ పాఠాలు చెప్పిన కేసులో అరెస్టు అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మరింత విచారణ చెయ్యాలని సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. కాలేజ్ అమ్మాయిల జీవితాలకు సంబంధించిన కేసు కావడంతో పూర్తి సమాచారం సేకరించాలని సీబీసీఐడి అధికారులు నిర్ణయించారు. నిర్మలా దేవి వ్యవహారం లోతుగా దర్యాప్తు చెయ్యడానికి ఆమెను మరికొన్ని రోజులు విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీబీసీఐడీ అధికారులు న్యాయస్థానంలో మనవి చేశారు.

'ఆయ‌న' భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే అంత సొమ్ము ఖ‌ర్చ‌యింద‌ట‌

'ఆయ‌న' భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే అంత సొమ్ము ఖ‌ర్చ‌యింద‌ట‌

బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ఆశారాం బాపు గత ఐదేళ్లుగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కారాగారంలో ఉన్నారు. 2013లో ఆశారాం అరెస్ట్ అయిన ఆయ‌న‌కు భద్రత కల్పించడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.7.25 కోట్లు ఖర్చుపెట్టిందట. ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగే సమయంలో ఆశారాం చుట్టూ 50 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. వారిలో ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు. ఏడాదికి దాదాపు వంద సార్లు ఆశారాం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేదని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం తెలిపింది. వాహనాలకు ఇంధనం ఖర్చు, ఇతర ఖర్చులేవీ ఇందులో చేర్చలేదని ప్రభుత్వం తెలిపింది.    
జ‌యల‌లిత‌ ర‌క్త న‌మూనాలు హైకోర్టు అడిగింది ఇందుకే...

జ‌యల‌లిత‌ ర‌క్త న‌మూనాలు హైకోర్టు అడిగింది ఇందుకే...

తమిళనాడు మాజీ సీఎం జయలలిత రక్తానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని అపోలో ఆసుపత్రికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను గురువారంలోగా సమర్పించాలని ఆదేశించింది. అమృత సారథి (37) అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. వివరాలను సమర్పించేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని అపోలో కోరినా హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తాను జయలలిత జీవ సంబంధ కుమార్తెనని అమృత సారథి 2017 నవంబరు 27న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్ధ‌ర‌ణ కోసం డీఎన్ఎ ప‌రీక్ష చేయాల‌ని కోరారు.