Short News

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు...మరోసారి ఏకగ్రీవ ఎన్నిక

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు...మరోసారి ఏకగ్రీవ ఎన్నిక

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న 25 రాష్ట్ర మహాసభల్లో 60 మంది సభ్యులతో కార్యవర్గాన్ని నియమిస్తూ తీర్మానం చేశారు. ఇందులో 10 మంది ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు, 15 మందితో కార్యదర్శి వర్గం, ఆహ్వానితులుగా 10 మంది, ప్రత్యేక ఆహ్వానితులుగా ఐదుగురు,జాతీయ మహాసభల ప్రతినిధులుగా 23 మంది నియమితులయ్యారని నూతన కార్యదర్శి పి.మధు ఈ సందర్భంగా తెలిపారు.

గీతాంజలి డైమండ్స్ ఉద్యోగుల ఆందోళన

గీతాంజలి డైమండ్స్ ఉద్యోగుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ర్యావిర్యాల పరిధిలోని సంగీత డైమండ్ కంపెనీ సీజ్‌తో ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. దీంతో కార్మికులంతా కంపెనీ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు . 250 ఎకరాల్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు గీతాంజలి జెమ్స్ అండ్ జ్యూయలరీగా మారింది. పంజాబ్ నేషనల్ స్కామ్ కేసులో నీరవ్ మోదీకి చెందిన ఆస్తులు జప్తు చేసే క్రమంలో గీతాంజలి జెమ్స్ అండ్ జ్యూయలరీలో ఈడీ అధికారులు తనిఖీలు చేసి, సీజ్ చేశారు. ఉద్యోగాలు ఊడిపోవ‌డంతో కార్మికులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.
పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

టెలికాం కంపెనీ ఐడీయా సెల్యూలార్ ..పానాసోనిక్ పీ 100 మొబైల్ పై రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ఆఫర్ లో భాగంగా రూ.5,299 ఫోన్ ను రూ.3,799 కే అందిస్తోంది. వినియోగదారులు మొదట ఫోన్‌ను రూ.5,299కు కొనుగోలు చేయాలి. అనంతరం అందులో ఐడియా సిమ్‌ను వినియోగించాలి. అప్పుడు నెలకు రూ.199 లేదా ఆపైన విలువ గల ప్లాన్‌ను వాడాలి. మొదటి 12 నెలల పాటు చేస్తే కస్టమర్లకు రూ.300 క్యాష్ బ్యాక్ వస్తుంది. మరో 12 నెలల పాటు ఇలాగే వాడితే మరో రూ.1200 క్యాష్ బ్యాక్ ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.3,799కే లభిస్తునట్టవుతుంది
అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స

అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స

రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాతవాసి అని.. అప్పుడప్పుడూ బయటికి వచ్చి మాట్లాడతారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు అవసరమైనప్పుడు మాట్లాడరని విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.