Short News

బోడిగుండుకు సన్మానాలా?, ‘జగన్-హోదా; ప్యాకేజీ-పప్పు’: గల్లా, లోకేష్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు

బోడిగుండుకు సన్మానాలా?, ‘జగన్-హోదా; ప్యాకేజీ-పప్పు’: గల్లా, లోకేష్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నిరసనలు వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని, ర్యాలీలు తీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి ముందే తెలిసినా.. ఏం తెలియనట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్‌ గురించి చంద్రబాబుకు తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు.

చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

టీ20 లీగ్ 2018లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయంపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్‌ చరిత్రలో చెత్తరికార్డును నమోదుచేసిన ముంబై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపధ్యంలో రోహిత్ మాట్లాడుతూ 'ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. పిచ్‌ స్వభావం ఎలాంటిదైనా కావచ్చు. ఇంత చిన్న(118 పరుగుల) లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధింగల సత్తా మా జట్టుకు ఉంది. బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాట్స్‌మన్లు దారుణంగా విఫలమయ్యారు. వ్యక్తిగతంగా నేను కూడా చెత్తగా ఆడానని చెప్పక తప్పదు' అని చెప్పాడు. 
భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తన టవర్‌ యూనిట్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు(రూ.71,500 కోట్లు). ఈ ఒప్పందంలో ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఉమ్మడి సంస్థ ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌గా కొనసాగనుంది.  
తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.