Short News

శైవక్షేత్రం ముట్టడికి బయలుదేరిన యాదవులు అరెస్ట్

శైవక్షేత్రం ముట్టడికి బయలుదేరిన యాదవులు అరెస్ట్

టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడాన్నిశివస్వామి తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆయన తీరుకు నిరసనగా తాళ్లాయపాలెంలో శివస్వామి నిర్వహిస్తున్న శైవక్షేత్రాన్ని ముట్టడించేందుకు యాదవులు కదిలోచ్చారు. అయితే  వందలాది మంది యాదవులు శైవక్షేత్రం ముట్టడికి బయలుదేరిన వేళ, అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. యాదవుల నిరసనలను ముందుగానే పసిగట్టిన పోలీసులు, వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు. ఉండవల్లి సెంటర్ లో యాదవ నిరసనకారులను అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు.
స్నేహితులుగా ర్యాంప్ వాక్ చేసిన మాజీ ప్రేమికులు

స్నేహితులుగా ర్యాంప్ వాక్ చేసిన మాజీ ప్రేమికులు

బాలీవుడ్ మాజీ ప్రేమికులు రణ్‌బీర్‌ కపూర్‌, దీపిక పదుకోన్ మనస్పర్ధలు ఏర్పడి విడిపోయినా స్నేహితులుగా ఉన్నారు. గురువారం ముంబయిలో జరిగిన 2018 మిజ్వాన్‌ ఫ్యాషన్ షోలో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని కలిసి ర్యాంప్ వాక్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన దుస్తులనే వేసుకున్నారు. 'రణ్‌బీర్‌, దీపిక కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం ర్యాంప్‌ వాక్ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది' అని మనీశ్‌ మల్హోత్రా వెల్లడించారు.
కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

శ్రీరెడ్డి వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. నటి కరాటే కళ్యాణి ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ చేసింది. 'పెళ్ళి కాని విమల(శ్రీరెడ్డి)కు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది. విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేసింది. అమ్మతో 10 సంవత్సరాలు నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌పల్లి లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువ గల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేసారు.? ఏంటో, విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా' అని పేర్కొంది.
ప్రతీ ఛానెల్ ఒక మాఫియాలా?, నాకు ఇద్దరు కూతుళ్లు.. భయంగా ఉంది

ప్రతీ ఛానెల్ ఒక మాఫియాలా?, నాకు ఇద్దరు కూతుళ్లు.. భయంగా ఉంది

నేటి ఉదయం న్యాయవాదులతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. 'సినిమాకు సెన్సార్ ఉంది. చిన్న పిల్లలు చూడకూడని విషయాలని నిర్మొహమాటంగా తీసేస్తారు. కానీ మీడియాకి సెన్సార్ ఎందుకు లేదు?. టీవి9 రవిప్రకాష్ తనను బ్లాక్ మెయిల్ చేశారని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు?.. అంటే ఆయనేదో తప్పు చేశాడనే కదా?..' అని ఆయన న్యాయవాదులతో అన్నారు.

'ప్రతీ ఛానెల్ ఒక మాఫియా లాగా తయారైంది. మీరు మాకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తున్నారు. మనకి అసలు వార్తలు అవసరం లేదు. మనం పురాతన కాలం నాటికి వెళ్లిపోదాం.' అని వ్యాఖ్యానించారు.