Short News

ఎంపీలతో ఈరోజే రాజీనామా చేయించాలి

ఎంపీలతో ఈరోజే రాజీనామా చేయించాలి

వైకాపా అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఈరోజే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానన్నారని గుర్తు చేసారు. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ఇటీవల వ్యాఖ్యానించారు. 
'ఈసారి కప్ మాదే' అంటున్న డివిలియర్స్

'ఈసారి కప్ మాదే' అంటున్న డివిలియర్స్

టీ20 లీగ్-2018లో బెంగళూరు తరపున ఆడుతున్న సఫారీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆటోలో సందడి చేసాడు. గురువారం భార్య, కుమారుడితో కలిసి బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అభిమానులు డివిలియర్స్‌ను గుర్తుపట్టేసి ఆటోను అనుసరించారు. 'ఈ సారి కప్‌ మాదే' అంటూ సందడి డివిలియర్స్‌ అభిమానులతో పాటు సందడి చేసాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు రెండు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. 
కొనసాగుతున్న లాభాలు ..సెన్సెక్స్ @ 35,000

కొనసాగుతున్న లాభాలు ..సెన్సెక్స్ @ 35,000

దలాల్‌ స్ట్రీట్‌ మళ్ళీ కళకళలాడుతోంది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయ షేర్లలో కొనుగోళ్ళు వెల్లువెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్‌ ఆరంభం నుంచే సూచీలు లాభాల్లో పరిగెడుతున్నాయి. సెన్సెక్స్‌ ప్రతిష్ఠాత్మక 35వేల మైలురాయిని తాకింది. సెన్సెక్స్‌ 310 పాయింట్లు ఎగబాకి 35,023 వద్ద  నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 10,704 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ షేర్లు దూసుకెళ్తున్నాయి.
చారిత్రాత్మకం: ద.కొరియా అధ్యక్షుడితో కిమ్ జంగ్ ఉన్ భేటీ

చారిత్రాత్మకం: ద.కొరియా అధ్యక్షుడితో కిమ్ జంగ్ ఉన్ భేటీ

ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఎట్టకేలకు కలుసుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతి పునరుద్దరణ కోసం ఈ ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. ఇద్దరు నేతలు ముఖంపై చిరునవ్వుతో కలుసుకొన్నారు. 1953 తర్వాత తొలిసారిగా ఉత్తరకొరియా అధ్యక్షుడు తొలిసారిగా దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని వీరిద్దరూ కలిసి పాన్‌మున్‌జోమ్‌లో మొక్కను నాటారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడ సమావేశమయ్యే అవకాశం ఉంది.