Short News

కేంద్ర మాజీమంత్రి బోళ్ళ బుల్లిరామయ్య అస్తమయం

కేంద్ర మాజీమంత్రి బోళ్ళ బుల్లిరామయ్య అస్తమయం

కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ బోళ్ళ బుల్లిరామయ్య (91) కన్ను మూసారు. రు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేసారు. 1996-98 మధ్య బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేసారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
ఆంధ్రుల కసి తెలుసు, ఢిల్లీతో పోరాడుతా: బాబు కీలక వ్యాఖ్య

ఆంధ్రుల కసి తెలుసు, ఢిల్లీతో పోరాడుతా: బాబు కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు కావాల్సిందే అన్నారు. తనకు అండగా నాలుగు లక్షల మంది సాధికార మిత్ర సైనికులు ఉన్నారని చెప్పారు. 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా కేంద్రం న్యాయం చేయాలని ఒకే మాట చెబుతున్నారన్నారు.

'ఏ మాయ చేసావే' సీక్వెల్ లో మాధవన్.?

'ఏ మాయ చేసావే' సీక్వెల్ లో మాధవన్.?

జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్న నటుడు మాధవన్. 17ఏళ్ళ క్రితం మాధవన్ నటించిన 'చెలి' సినిమాతో గౌతమ్ మీనన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. వీరిద్దరూ కలిసి మరో సినిమాకి సిద్ధమవుతున్నారు. 'ఏ మాయ చేసావే'కి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తున్న ఈ చిత్రాన్ని స్నేహం నేపధ్యంలో తెరకెక్కిస్తారని సమాచారం. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించే ఈ సినిమా కోసం మరో ఇద్దరు హీరోలను ఎంపిక చేయనున్నారు.  
క్రైస్తవ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం అస్తమయం

క్రైస్తవ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం అస్తమయం

ఆరు దశాబ్దాలకు మత ప్రబోధకుడిగా విశేష సేవలు అందించిన బిల్లీ గ్రాహం (99) కన్నుమూసారు. గత కొన్నేళ్ళుగా ప్రొస్టేట్ క్యాన్సర్, పార్కిన్‌సన్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న బిల్లీ గ్రాహం అమెరికా నార్త్ కరోలినాలో మోన్‌ట్రీట్‌లోని స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటిస్తూ అన్ని మతాల వారు ఓ మంచి వ్యక్తిని కోల్పోయారని పేర్కొన్నారు.