Short News

రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్ క్రాష్.. క్లాసిక్ 500 బైక్ అమ్మకాలు నిలిపివేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్ క్రాష్.. క్లాసిక్ 500 బైక్ అమ్మకాలు నిలిపివేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్ కు ఫుల్ డిమాండ్ రావడంతో అమ్మకాలను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ నెల10న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ బైక్ బుకింగ్స్‌ను ఆన్‌లైన్లో ప్రారంభించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పడంతో ఒక్కసారిగా లక్షల మంది బుకింగ్స్ కోసం ప్రయత్నించారు. ఈ సందర్భంగా వెబ్‌సైట్ క్రాష్ అవడంతో ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా సంస్థ వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు అమ్మకాలు ప్రారంభిస్తామో తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ బైక్‌తోపాటు ఓ టీషర్ట్, హెల్మెట్ కూడా కంపెనీ అందించనుంది. ఇండియాలో దీని ధరను రూ.2.4 లక్షలుగా నిర్ణయించారు.
స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

స్థానిక నగల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో నేటి బులియన్‌ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 తగ్గి రూ.31,050గా ఉంది. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ స్థానికంగా డిమాండ్‌ లేమితో ధర తగ్గింది. వెండి ధర కూడా అదే బాటలో నడుస్తోంది. కేజీ వెండి ధర రూ.130 తగ్గి రూ.39,820కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తక్కువగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి.   
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన టీడీపీ

కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీల సాధన కోసం టీడీపీ మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. మంగళవారం తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ సీఎం చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెదేపా ఎంపీ నాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.   
బాడీ మసాజ్ కు ఈ నూనెలు ఎంతో ఉత్తమం.!

బాడీ మసాజ్ కు ఈ నూనెలు ఎంతో ఉత్తమం.!

బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more