Short News

ఎక్స్-బ్లేడ్ మీద బుకింగ్స్ ప్రారంభించిన హోండా

ఎక్స్-బ్లేడ్ మీద బుకింగ్స్ ప్రారంభించిన హోండా

హోండా ఎక్స్-బ్లేడ్ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న హోండా షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐదు విభిన్న రంగుల్లో లభించనున్న హోండా ఎక్స్-బ్లేడ్ రూ. 79,000 ల కంటే తక్కువ ధరతో లభించనుంది.

హోండా ఎక్స్‌-బ్లేడ్ తొలుత ఆటో ఎక్స్‌పో 2018లో రివీల్ అయ్యింది. ప్రత్యేకించిన ఇండియన్ మార్కెట్ కోసం ఈ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చినట్లు హోండా ప్రతినిధులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు డ్రైవ్‌స్పార్క్ తెలుగులో...

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సహజీవనం చేస్తున్న హనుమంతును వివాహం చేసుకోవాలని ప్రియురాలు సరిత కోరింది. అయితే అప్పటికే వివాహమై పిల్లలున్నా హనుమంతు నిరాకరించడంతో దీంతో సరిత హనుమంతును హత్యచేసింది. ఈ కేసులో సరితకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.