Short News

హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్

హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్

ఆటో ఎక్స్‌పో 2018: హోండా టూ వీలర్స్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో సరికొత్త ఎక్స్-బ్లేడ్ బైకును ఆవిష్కరించింది. ఎక్స్-బ్లేడ్ కంపెనీ యొక్క 160సీసీ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్.

ఎక్స్-బ్లేడ్ పూర్తి డిజైన్ చూడటానికి హార్నెట్ 160ఆర్ బైకును పోలి ఉంటుంది. అయితే, ఎక్స్-బ్లేడ్ బైకులో శక్తివంతమైన ఇంజన్‌తో పాటు అధునాతన ప్రీమియమ్ ఫీచర్లు కూడా వచ్చాయి. మరిన్నివివరాలు మరియు ఫోటోలు డ్రైవ్‌‌స్పార్క్ తెలుగులో...

అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

సొంతగడ్డపై బెంగళూరు చెలరేగిపోయింది. ఏబీ డివిలియర్స్‌ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని అవలీలగా దాటించేసాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'మా జట్టులో చిరునవ్వులకు కారణం ఏబీడీనే. తనదైన శైలిలో రెచ్చిపోయి ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఈ కారణంగానే అతణ్ని ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు అనటంలో ఎలాంటి సందేహం లేదని' కితాబిచ్చాడు. 
చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

రాజస్థాన్‌ రాయ‌ల్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. బ్యాటుతో సంజు శాంసన్‌, గౌతమ్‌ బంతితో ఆర్చర్‌ మెరిసిన వేళ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (72), ఇషాన్‌ కిషన్‌ (58) మెరవడంతో మొదట ముంబయి 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. సంజు శాంసన్‌ (52), స్టోక్స్‌ (40), గౌతమ్‌ (33 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోర్నీలో రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా ముంబయికి నాలుగో పరాజయం.  
బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.