Short News

ఆటో ఎక్స్‌పో 2018: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఆవిష్కరణ

ఆటో ఎక్స్‌పో 2018: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఆవిష్కరణ

ఆటో ఎక్స్‌పో 2018: జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్స్ ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. సుజుకి లైనప్‌లో ఉన్న బర్గ్‌మ్యాన్ శ్రేణి నుండి ఎంట్రీ లెవల్ వెర్షన్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125సీసీ స్కూటర్‌ను భారత మార్కెట్ కోసం తీసుకొచ్చింది.

సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోలు డ్రైవ్‌స్పార్క్ తెలుగులో....

అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..

అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..

ఫ్లోరిడా స్కూల్ కాల్పుల ఘటన తర్వాత అమెరికాలోని చాలామంది చిన్నారులు.. ఎక్కడ తమ స్కూల్లో కాల్పులు చోటు చేసుకుంటాయో? అన్న భయాందోళనతో గడుపుతున్నారట. ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) సర్వేలో ఈ విషయం వెల్లడైంది.13 నుంచి 17ఏళ్ల వయసున్న విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సర్వేలో 57 శాతం చిన్నారులు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు.

పవన్ వైఖరికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన..

పవన్ వైఖరికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన..

మీడియా సంస్థల పట్ల పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజె) కమిటీ ప్రెసిడెంట్ అల్లం నారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మీడియా స్వేచ్చను కాపాడుకోవడానికి జర్నలిస్టు సంఘాలు సదా సిద్దంగా ఉంటాయని పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు గుర్తుంచుకుంటే మంచిదని నోట్ ద్వారా తెలిపారు. పవన్ కల్యాణ్ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 21 నాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.

పవన్ కల్యాణ్ పై  ఆర్కే రూ.10కోట్ల పరువు నష్టం దావా..

పవన్ కల్యాణ్ పై ఆర్కే రూ.10కోట్ల పరువు నష్టం దావా..

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పరువు నష్టం దావా వేయబోతున్నారు. తనపై కుట్ర పన్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఆయన న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసుతో పాటు రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు సమాచారం.

కాగా, శ్రీరెడ్డి తన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారని పవన్ చేసిన ఆరోపణలను ఏబీఎన్ ఖండించింది. తమ ఛానెల్ జర్నలిజం విలువలను పాటించిందని, ఆ బూతు పదాన్ని మ్యూట్ చేశాకే ప్రసారం చేశామని వివరణ ఇచ్చింది.