Short News

పీ ఎన్ బీలో రూ. 11 వేల కోట్ల స్కాం

పీ ఎన్ బీలో రూ. 11 వేల కోట్ల స్కాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 11 వేల కోట్లపైనా స్కాం జరిగింది. ఇప్పటికే విజయమాల్యా ఎగ్గొట్టిన 9 వేల కోట్లతో బ్యాంకులు సతమతమవుతుంటే.. ఇప్పుడు భారీ కుంభకోణంతో బ్యాంకింగ్ వ్యవస్త షాక్ తిన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ముంబై లో ఓ బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. కొన్ని మోసపూరిత, అనధికారికి లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది.
అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

సొంతగడ్డపై బెంగళూరు చెలరేగిపోయింది. ఏబీ డివిలియర్స్‌ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని అవలీలగా దాటించేసాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'మా జట్టులో చిరునవ్వులకు కారణం ఏబీడీనే. తనదైన శైలిలో రెచ్చిపోయి ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఈ కారణంగానే అతణ్ని ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు అనటంలో ఎలాంటి సందేహం లేదని' కితాబిచ్చాడు. 
చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

రాజస్థాన్‌ రాయ‌ల్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. బ్యాటుతో సంజు శాంసన్‌, గౌతమ్‌ బంతితో ఆర్చర్‌ మెరిసిన వేళ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (72), ఇషాన్‌ కిషన్‌ (58) మెరవడంతో మొదట ముంబయి 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. సంజు శాంసన్‌ (52), స్టోక్స్‌ (40), గౌతమ్‌ (33 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోర్నీలో రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా ముంబయికి నాలుగో పరాజయం.  
బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.